యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు కూడా దినకరన్ పార్టీ నుంచి ఎవరు వచ్చినా పార్టీలో చేర్చుకుంటామని చెబుతున్నారు. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు కూడా ఇది వర్తిస్తుందని చెబుతున్నారు. దినరకన్ పార్టీ చివరకు అన్నాడీఎంకేలో విలీనం అవ్వడం ఖాయమని వారు ప్రతి చోటా, ప్రతి సభలో చెప్పుకుంటూ వస్తున్నారు. రాష్ట్రానికి వచ్చిన కేంద్రమంత్రులు కూడా ఇదే రీతిలో వ్యాఖ్యానిస్తున్నారు. దినకకరన్ ఏఎంఎంకేని అన్నాడీఎంకేలో విలీనం చేయాలని కేంద్రమంత్రి రామ్ దాస్ అధవాలే కోరిన సంగతి తెలిసిందే. దినకరన్ మాత్రం అన్నాడీఎంకే కూటమిలో చేరేందుకు ఇష్టపడటం లేదు. అన్నాడీఎంకే బీజేపీతో కలుస్తుందని దినకరన్ బాహాటంగానే చెబుతున్నారు. తన మేనత్తను జైల్లో పెట్టడానికి కారణమైన బీజేపీ ఉన్న కూటమిలో ఎలా చేరతారనుకుంటున్నారని దినకరన్ ప్రశ్నిస్తున్నారు. ఆయన టార్గెట్ అంతా పళనిస్వామి..పన్నీర్ సెల్వం మాత్రమే. అన్నాడీఎంకే ను చీల్చాలన్నది దినకరన్ యత్నం. వచ్చే ఉప ఎన్నికల్లో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలను గెలిపించుకోగలిగితే చాలా మంది ఎమ్మెల్యేలు తన వద్దకు వస్తారంటున్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత పళని జాతకం తారుమారుఅవుతుందని దినకరన్ జోస్యం చెబుతున్నారు.వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అన్నాడీఎంకేకు ఒక్కసీటు కూడా రాకుండా చేయాలంటే డీఎంకే తో చేతులు కలపాలా? వద్దా? అన్నదానిపై చర్చలు జరుపుతున్నారు. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో జరుగుతున్న ఉప ఎన్నికలలో డీఎంకే తమ అభ్యర్థిని పోటీకి దింపకుంటే లోక్ సభ ఎన్నికల్లో దానికి మద్దతివ్వాలన్నది దినకరన్ ఆలోచనగా ఉంది. అయితే డీఎంకే తో కలస్తే పార్టీ పేరు బద్ నామ్ అవుతుంది. జయలిత పేరు మీద పెట్టిన పార్టీ కావడంతో అమ్మకు బద్ధ విరోధి అయిన డీఎంకే తో పొత్తు పెట్టుకుంటే తప్పుడు సంకేతాలు వెళతాయన్నది కూడా ఆ పార్టీలో కొందరి ఆలోచన. అందుకే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున పార్టీ ముఖ్యనేతలతో చర్చించిన తర్వాతనే డీఎంకేతో కలసి పోటీ చేయాలా? లేదా? అన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. అన్నాడీఎంకలో పార్టీని విలీనం చేసేది లేదని మాత్రం దినకరన్ స్పష్టం చేశారు.
Related Posts