యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటునుంచి ఎటువైపు తిరుగుతున్నాయో ఎవ్వరికీ అర్థంకాని పరిస్థితులు నెలకొన్నాయి. ఏ పార్టీ నేత ఏ జెండా పడతాడో! ఎవరు ఎవరివైపు నుంచి ప్రచారంలోకి దిగుతారో అస్సలు ఊహించలేకపొతున్నారు జనం. ఓ వైపు చంద్రబాబు తనదైన స్టైల్‌లో ఇతర పార్టీ నేతలను ఆకట్టుకోవడం చూసి.. కాంగ్రెస్ పార్టీ కొత్త ఆలోచనలు చేస్తోంది. ఈ మేరకు చిరంజీవిని ప్రచారంలోకి దించాలని ప్లాన్ చేస్తోందట కాంగ్రెస్ పార్టీ. ఇది వినడానికి బాగానే ఉన్నా ఆచార యోగ్యమేనా? అనేది మాత్రం అందరిలో నెలకొన్న సందేహం. తమ్ముడు పవన్ జనసేన పార్టీ పేరిట ఏపీలో పోటీకి దిగుతుంటే.. అన్నయ్య కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయటం సాధ్యమేనా? ఒకవేళ అదే జరిగితే ఏపీలో నెలకొనే పరిస్థితులు ఎలా ఉంటాయి అనే దానిపై చర్చలు సాగుతున్నాయి. ప్రజారాజ్యం అంటూ జనం లోకి వచ్చిన చిరంజీవి.. ఆ తర్వాత చేతులెత్తేసి ఆ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్‌లో కలిపేశారు. దానికి ఫలితంగా ఆయనకు కేంద్ర మంత్రి పదవి దక్కింది. ఆరేళ్ల పాటు ఎంపీగా అన్నీ అనుభవించారు. ఆ తర్వాత మాత్రం కాంగ్రెస్ చేపట్టిన ఏ కార్యక్రమంలోనూ చిరు కనిపించలేదు. సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చి సినీ లోకంలో బిజీ అయ్యారు. ఈ లోగా ఆయన తమ్ముడు పవన్.. జనసేనానిగా జనంలో దూకాడు. లోలోపల అన్నదమ్ములు ఎలా డిసైడ్ అయ్యారో కానీ.. చిరు మాత్రం తాను జనసేన ఫేవర్ అని గానీ, జనసేన సపోర్ట్ చేయాలని గానీ ఎప్పుడూ బయటకు చెప్పలేదు. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ 175 స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పిన రఘువీరారెడ్డి.. కాంగ్రెస్ తరఫున ప్రచారానికి మెగాస్టార్ రంగంలోకి దిగుతున్నారని ప్రకటించడం జనానికి షాకిచ్చింది.నిజంగా చిరంజీవి గనక కాంగ్రెస్ తరఫున ప్రచారానికి వస్తే.. దాని ప్రభావం ముందుగా జనసేన పైనే పడటం ఖాయం. జనసేనకు పడే ఓట్లన్నీ చిరంజీవి ఎఫెక్ట్‌తో చీలిపోతాయి. కాబట్టి.. రఘువీరారెడ్డి అలా ప్రకటించినా ఇప్పటివరకు మెగాస్టార్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. అటు చూస్తే కాంగ్రెస్..