రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ రంగాలలో జరుగుతున్న కార్యక్రమలపై రూపొందించిన శకటాలు ప్రదర్శించాయి. తొలుత వ్యవసాయ, అనంతరం సీఆర్డీఏ, విద్యాశాఖ, అటవీశాఖ, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ, గృహనిర్మాణ శాఖ, ఉద్యాన శాఖ, సమాచార ,పౌర సంబంధాల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ పేదరిక నిర్ములన సంస్థ, పర్యాటక శాఖ, జలవనరుల శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ల ఆధ్వర్యంలో అలంకృత శకటాలు ప్రదర్శించాయి. ఈ యేడాది అటవీశాఖ కు ద్వితీయ బహుమతి వచ్చింది. ఈ సందర్భంగా అటవీ శాఖ అధిపతి డాక్టర్ మహ్మద్ ఇలియాస్ రీజ్వీ మాట్లాడుతూ అటవీశాఖ అధికారులు..సిబ్బంది పూర్తిస్థాయిలో పనిచేసినందున దేశంలోనే పచ్చదనంలో నంబర్ వన్ స్థానం సంపాదించటం జరిగిందన్నారు. ద్వితీయ బహుమతి పొందిన స్ఫూర్తితో ఈ యేడాది అటవీ శాఖ మరింత చురుకుగా పనిచేస్తుందన్నారు. ద్వితీయ బహుమతి పొందిన సందర్భంగా గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అటవీశాఖ అధికారులను అభినందించారు