యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలన్నీ అణాపైసలతో సహా మాఫీ చేస్తానని వాగ్దానం చేసిని చంద్రబాబు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. మరో నెలలో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ వస్తుందనగా ఇప్పుడు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తాడా? డ్వాక్రా మహిళలకు ఈరోజు చెల్లని చెక్కులు ఇస్తున్నాడు. ఆ చెక్కులు ఎందుకు అయ్యా? అని ప్రశ్నిస్తున్నామని వైకాపా నేత వాసిరెడ్డి పద్మ విమర్శించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. గా రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు అన్నగా ఈ చెక్కులను ఇస్తున్నానని ప్రచారం చేసుకుంటున్నాడు. అన్న అయితే ఇటువంటి చెల్లని చెక్కులు ఇస్తాడా అని నిలదీసారు. చంద్రబాబుకు నిజంగా మనసు ఉంటే.. ఇస్తానన్న రూ. 10 వేలు ఒకేసారి ఇచ్చినట్టు అయితే వారికి కొంత ఊరటగా ఉండేది. 2014 నుంచి 2018 వరకు ఒక్క రూపాయి కూడా డ్వాక్రా రుణ మాఫీ చేయలేదని అసెంబ్లీలోనే మంత్రి పరిటాల సునీత స్పష్టం చేశారు. చంద్రబాబు చెప్పేదానిలో ఒక్కటీ నిజం లేదు. ఆయన అధికారంలోకి వచ్చేనాటికి రూ. 14, 204 కోట్ల డ్వాక్రా రుణాలు ఉంటే.. అవి ఈరోజు వడ్డీతో కలిపి రూ. 25 వేల కోట్లకు చేరాయి. డ్వాక్రా రుణ మాఫీ చేయలేదని 90 లక్షల డ్వాక్రా మహిళలందరికీ తెలుసని ఆమె అన్నారు. మహిళల ముందుకొచ్చి ఓట్ల కోసం చంద్రబాబు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. రుణ మాఫీ చేయకపోగా డ్వాక్రా మహిళలను మరింత అప్పుల్లోకి నెట్టారు. 2016 అక్టోబరు నుంచి సున్నా వడ్డీ రుణాలకు సంబంధించిన డబ్బులను సైతం చెల్లించడంలేదు. డ్వాక్రా మహిళలను, ఆ సంఘాలను నిర్వీర్యం చేసి.. ఈరోజు మహిళా ఉద్ధారకుడిగా చెప్పుకుంటున్నాడు. ఈయన మహిలోద్దారకుడు కాదు.. మహిళాసురుడు అనాలి. పసుపు- కుంకమ అంటే మహిళలకు ఒక నమ్మకం, పవిత్రత ఉంది. చంద్రబాబు సొంత ఇంట్లోనే ఆయన తోబుట్టువులకు కూడా అన్యాయం చేశాడు. అటువంటి వ్యక్తి రాష్ట్రంలో మహిళలకు న్యాయం చేస్తాడా అని అన్నారు. తన తల్లి అమ్మణమ్మ చిత్తూరు జిల్లాలో ఉన్న 2 ఎకరాల పొలంతో పంట నుంచి వచ్చిన ఆదాయంతో హైటెక్ సిటీలో 5 ఎకరాల పొలం చంద్రబాబు కొడుకు లోకేశ్ కు కొనిపించింది. తల్లి ఆస్తి ఎప్పుడూ కూడా ఆడపిల్లలకు చెందుతుంది. కానీ అమ్మణమ్మ ఆస్తిని కూతుళ్ళకు కానీ, కూతుర్ల పిల్లలకు గానీ ఇవ్వకుండా లోకేశ్ కు రాసిచ్చిందంటే చంద్రబాబు తోబుట్టువులకు అన్యాయం చేయటం కాదా అని ప్రశ్నించారు. కన్నతల్లికి అన్నం పెట్టని వాడు, పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? అని వైయస్ఆర్ చంద్రబాబు గురించి అంటుండేవారు. డ్వాక్రా మహిళలకు 10 వేలు, సెల్ ఫోన్లు అని ఈరోజు ప్రచారం చేస్తూ.. అదికూడా పార్టీకి ఓటేస్తేనే.. గెలిపిస్తేనే సెల్ ఫోన్అని చంద్రబాబు మాట్లాడతారు. మహిళలు బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని అంతా విడిపిస్తానని ఎన్నికల ముందు చెప్పారు. విడిపించారా అని అడిగారు. మహిళలకు భరోసా ఇస్తానన్నారు. ఎక్కడ ఇచ్చారు? మహిళలకు ఆస్తి హక్కు కల్పిించిన పార్టీ తెలుగుదేశం అని మాట్లాడే మీరు.. తోబుట్టువుల ఆస్తులనే కొట్టేసింది నిజం కాదా? మహిళా సిబ్బందితో సంఘ దర్శిని అని పేరు పెట్టి ప్రభుత్వ ఖర్చుతో చంద్రబాబు తెలుగుదేశం ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పసుపు-కుంకమ కు ఉన్న పవిత్రను చెడగొడుతున్నారు. చంద్రబాబు కాపీ రాయుడులా తయారయ్యారని ఆమె విమర్శించారు.