యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశంఈ నెల 30న ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో నిర్వహించనున్నట్లు సీఎస్ అనిల్ చంద్ర పునేఠ ఒక ప్రకటనలో తెలిపారు. 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతుండడంతో సభలో ప్రవేశపెట్టాల్సిన అంశాలపై మంత్రిమండలి సమావేశంలో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. ఆ రోజు ఉదయం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం తర్వాత సభను వాయిదావేసి, తిరిగి 4వ తేదీ నుంచి సమావేశాలు కొనసాగించనున్నట్లు సీఎస్ తెలిపారు