Highlights
ఐదుగురు మహిళల మృతి
అంతర్గత భద్రతా మంత్రిత్వ శాఖ
రష్యాలోని దగెస్తాన్ ప్రాంతంలోని కిజ్‌లయార్ పట్టణంలో ఓ చర్చిలో ఇస్లాం ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో ఐదుగురు మహిళలు మృతిచెందారు. ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఆ తరువాత పోలీసులు నిందితుడిని హతమార్చారు. ప్రార్థన చేస్తున్న క్రైస్తవులపై గుర్తుతెలియని దుండగుడు కాల్పులకు తెగబడ్డాడని, నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందగా మరో మహిళ ఆసుపత్రిలో కన్ను మూసినట్లు అంతర్గత భద్రతా మంత్రిత్వ శాఖ పేర్కొంది. దుండగుడి వయసు 20-30 ఏళ్ల మధ్య ఉంటుందని, అతడు స్థానికుడేనని ఇంటర్‌ఫాక్స్ వార్తా సంస్థ వెల్లడించింది. 'అల్లాహు అక్బర్' అని నినదిస్తూ గడ్డంతో ఉన్న వ్యక్తి రైఫిల్, కత్తితో చర్చిలోకి చొచ్చుకొచ్చి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఫాదర్ పావెల్ చెప్పారు.