మై ఛానల్, నా ఇష్టం పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన నటుడు నాగబాబు, దీని ద్వారా ఏపీలోని రాజకీయ పార్టీలు, నేతలను టార్గెట్ చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజకీయం అంటే డబ్బు కుమ్మరించడం, ఓట్లను కొనడం, గెలిచాక దోచుకోవడం ఇదే జగన్ పద్ధతి, ఆయన పార్టీలో చేరేవారిది కూడా ఇదే విధానం అంటూ గతంలో వైసీపీ అధ్యక్షుడు నోరుజారినప్పుడు వీడియోను పోస్ట్ చేశారు. జగన్‌తో వైసీపీ నేత మాట్లాడుతూ.. అతడు చాలా డబ్బున్నోడు సర్.. పర్లేదు సర్ అంటే, డబ్బులు ఉండటం కాదు ఖర్చుపెడతాడా? అంటూ జగన్ బదులిచ్చినట్టు ఈ వీడియోలో ఉంది. ‘మీరు ఇవాళ ఏది అయితే వస్తుందని అనుకుంటున్నారో, ఏదైతే నష్టపోతానం అనుకుంటున్నారో ఇంకా రెండే రెండేళ్లు ఓపిక పట్టండి.. మనం అధికారంలోని వచ్చిన తర్వాత ఇవాళ మీరు పోయిద్ధి అనుకున్నది నాలుగు అంతలు మీకు వచ్చేటట్టు చేస్తానని మాత్రం నేను హామీ ఇస్తున్నారు.. కొద్దిగా ఓపికతో రెండేళ్లు ఆగితే మన ప్రభుత్వమే వస్తుంది... ఆ తర్వాత మన ప్లేట్లో మన బిర్యానీ మనమే తినొచ్చు’ అని వైసీపీ అధినేత చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. ‘వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచి, ఏపీని బిర్యానీ ప్లేటులా చేసుకుని అందులోని ఉన్న బిర్యానీని తిన్నేద్దమనే ప్లాన్ చేశారు. ఆయనే కాదు జగన్ అనుచరులు కూడా ఇదే పంథాతో ఉన్నారు.. లేకపోతే ఒకదాంట్లో డబ్బు తీయాలా, ఎందుకు తీయాలి.. ఎన్నికల కమిషన్ చెప్పిన డబ్బులు సరిపోతాయి కదా? ఎమ్మెల్యే, ఎంపీలకు అవి చాలు కదా? ఎవరైనా డబ్బు తీయాలి? అనటం ఏంటి.. జగన్మోహన్ రెడ్డిగారు డబ్బు తీసే విషయంలో ఎంత బలంగా ఉన్నారో అర్థమవుతుందని’ నాగబాబు వ్యాఖ్యానించారు. ‘అలాగే, రెండేళ్లు ఆగండి మన రాజ్యం వస్తుంది, పోయిన దానికి నాలుగింతలు సంపాదించి పెట్టే పూచీ నాదని హామీ ఇచ్చారు.. దీని అర్థం ఏంటి.. మొన్న తాను విడుదల చేసిన వీడియాలో జగన్ ఇంటర్వ్యూను తప్పుగా అర్థం చేసుకున్నారని కొందరన్నారు. అది వదిలేద్దాం సరే.. ఎన్నికల్లో ఖర్చుపెట్టిన మొత్తాన్ని తిరిగి నాలుగింతలు వచ్చేలా చేస్తానని గ్యారంటీ ఇస్తున్నారంటే, బాగు డబ్బు ఖర్చుపెట్టి గెలవాలని చెబుతున్నారు.. ఏపీని బిర్యానీ ప్లేట్‌లా చేసి తినేద్దామన్నాడంటే ఇంత క్లారిటీ, ముందుచూపు ఉన్న నేత మనకు ఇండియాలో ఎక్కడ దొరుకుతారు.. ఆయన విజన్ తిరుగులేనిది, ఇది ఏపీ ప్రజలపట్ల జగన్‌కు ఉన్న ప్రేమ, అభిమానం.. ఇలాంటి విజన్ ఉన్న నాయకుడు మనకు కావాలా? లేకపోతే ప్రజలకు సేవ చేద్దాం, వారి కష్టాలు చూసి చలించిపోయిన మనసున్న మనిషి కావాలో? మీరే తేల్చుకోండి’ అంటూ విమర్శలు గుప్పించారు.