YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

అరుదైన రికార్డ్ లో ధోని

అరుదైన రికార్డ్ లో ధోని

యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అరుదైన వన్డే రికార్డ్‌లో టాప్-3లోకి ప్రవేశించాడు. న్యూజిలాండ్‌‌తో మౌంట్‌ మాంగనుయ్‌ వేదికగా శనివారం జరుగుతున్న రెండో వన్డేలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన ధోనీ 33 బంతుల్లో 5x4, 1x6 సాయంతో అజేయంగా 48 పరుగులు చేశాడు.  మ్యాచ్‌ ఆడటం ద్వారా భారత్ తరఫున అత్యధిక వన్డేల్లో ప్రాతినిథ్యం వహించిన మూడో క్రికెటర్‌గా ధోనీ రికార్డుల్లో నిలిచాడు. 2004, డిసెంబరు 23న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌తో వన్డే ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేసిన ధోనీ.. ఇప్పటి వరకూ భారత్ తరఫున 334 వన్డేల్లో ఆడాడు. వాస్తవానికి ఈ మాజీ కెప్టెన్ కెరీర్‌లో ఇప్పటికే 337 వన్డే మ్యాచ్‌లు ఆడినప్పటికీ ఇందులో మూడు మ్యాచ్‌లు ఆసియా ఎలెవన్ తరఫున ఆడినవి. భారత్ తరఫున అత్యధిక వన్డేలు ఆడిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ 463 వన్డేలతో అగ్రస్థానంలో ఉండగా.. అతని తర్వాత రాహుల్ ద్రవిడ్ 340 మ్యాచ్‌లతో ఉన్నాడు. తాజాగా ఈ జాబితాలో 334 మ్యాచ్‌లతో మూడో స్థానంలోకి ఎగబాకిన ధోనీ.. మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ సరసన నిలిచాడు. 2014లో టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. అప్పటి నుంచి కేవలం వన్డే, టీ20ల్లో మాత్రమే ఆడుతున్నాడు. అయితే.. ఈ ఏడాది మే నెలలో ప్రపంచకప్ ముగిసిన తర్వాత అతను రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related Posts