యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
హైదరాబాద్లోని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో 70వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ వేడుకల్లో రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా వైఎస్ జగన్ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ..'తెలుగువారందరి ఇంటా భోగభాగ్యాలూ సిరిసంపదలూ సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ వర్ధిల్లాలని, ఎంతో గొప్పవైన మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం నిలవాలని నిండు మనసుతో కోరుకుంటూ... అందరికీ సంక్రాంతి శుభాక్షాంక్షలు' అంటూ ట్వీట్ చేశారు.