YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చ

పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చ
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

తెలుగు దేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం శనివారం ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఫిబ్రవరి 1న ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన బంద్ పిలుపై కూడా చర్చించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీపీ సమావేశమైంది. ఈ భేటీలో పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈవీఎంల వినియోగాన్ని వ్యతిరేకించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రజల డిమాండ్లనే రాజకీయ పార్టీలు అడిగేదని, అనేక పార్టీల్లో ఈవీఎంలపై వ్యతిరేకత ఉందని చంద్రబాబు చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాలే ఈవీఎంలు వాడటం లేదని, హ్యాకర్లకు ప్రజాస్వామ్యాన్ని బలి చేయరాదన్నారు. ఈవీఎంల్లో హ్యాకింగ్‌కు 100శాతం అవకాశాలు ఉన్నాయని, నమ్మకం లేని విధానంపై ఒత్తిడి చేయరాదని వ్యాఖ్యానించారు. ప్రజల్లో విశ్వాసం పెంచడమే ప్రజాస్వామ్యమన్నారు.

‘‘నాలుగున్నరేళ్లలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగింది. విభజన చట్టంలో హామీలను అమలు చేయలేదు. ఐదు అంశాలు పాక్షికంగా అమలయ్యాయి. వెనుకబడిన జిల్లాలకు రూ.24,350 కోట్లు ఇవ్వాలని కోరాం. నాలుగున్నరేళ్లలో రూ.1,050 కోట్లు ఇచ్చారు. రూ.350 కోట్లు వెనక్కి తీసుకుని ఏడాది అవుతోంది. వెంటనే రూ.700 కోట్లు ఇవ్వాలని నీతి అయోగ్ చెప్పింది. 7 జిల్లాలకు రెండేళ్ల నిధులు రూ.700 కోట్లు నిలిపేశారు. తెలంగాణలో 9 జిల్లాలకు రూ.450 కోట్లు ఇచ్చారు. 7 జిల్లాల్లో రూ.1,641 కోట్లతో 25,007 పనులు చేపట్టాం’’ అని చంద్రబాబు తెలిపారు.ఏపీని దేశంలో ఒక రాష్ట్రంగా చూడటం లేదని, అన్నింటిలోనూ వివక్ష ప్రదర్శిస్తున్నారని ఎంపీ రామ్మోహన్‌నాయుడు ధ్వజమెత్తారు. పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర హక్కుల కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. వెనక్కి తగ్గాల్సిన అవసరం తామకు లేదని, సస్పెండ్‌ చేసినా వెనకాడమని హెచ్చరించారు. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తామని, మిగతా పక్షాలతో రెండు రోజుల్లో సమావేశమవుతామన్నారు. సమావేశాల రోజు తమ ప్రతిఘటన ఉంటుందని రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఈవీఎంల అంశంపై ముందు అన్ని పక్షాలతో ఈసీని కలుస్తామని, ఆ తర్వాత న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తామన్నారు. పార్లమెంట్‌ సమావేశాల ముందురోజు మిగతా పక్షాలతో సమావేశమవుతామని ఆయన చెప్పారు. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ పెట్టే హక్కు ఈ ప్రభుత్వానికి లేదని, 2 నెలలు మాత్రమే ఉండే ఎన్డీఏకు సంవత్సరానికి అయ్యే బడ్జెట్‌ పెట్టే అర్హత ఎక్కడుందని రామ్మోహన్‌నాయుడు ప్రశ్నించారు

Related Posts