Highlights
- టీడీపీలో వర్గపోరు
- సీఎం రమేష్ కార్యాలయంపై దాడి
- ఉద్రిక్త వాతావరణం
రాష్ట్ర రాజకీయాలతో అతలాకుతలమవుతున్న తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి సెగలు కక్కుతోంది. కడప జిల్లాలోని పార్టీలో అంతర్గతంగా రేగుతున్న వర్గపోరు రచ్చకెక్కింది. ఓ కాంట్రాక్ట్ విషయంలో టీడీపీ వర్గాలు బాహాబాహీకి దిగాయి. టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మంత్రి ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి వర్గీయులు రెచ్చిపోయారు. గండికోట రిజర్వాయర్ పరిధిలో కొండాపురంలో పునరావాస కాలనీ పనులకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లకు పిలిచింది. ఈ టెండర్ల విషయంలో మంత్రి ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి వర్గీయులు సిండికేట్ అయ్యారు. తమకు కాకుండా సీఎం రమేష్‌కు కాంట్రాక్ట్ పనులు అప్పగించడంపై స్థానిక టీడీపీ నేతలు చాలాకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉప్పు,నిప్పుగా ఉండే మంత్రి ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి టెండర్ల విషయంలో సిండికేట్‌గా మారటం గమనార్హం. నిన్న మొన్నటి వరకు ఉప్పు,నిప్పుగా ఉండే మంత్రి ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి టెండర్ల విషయంలో సిండికేట్‌గా మారటం గమనార్హం. దీనితో సీఎం రమేష్..ఆ టెండర్ల ప్రక్రియను నిలిపివేశారు. ఈ విషయం తెలుసుకున్నమంత్రి ఆది, రామసుబ్బారెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ...
సీఎం రమేష్ కార్యాలయంపై దాడి చేసి కంపూటర్లు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అంతేకాకుండా సమీపంలో సీఎం రమేష్ చేస్తున్న రోడ్ల పనులను కూడా బలవంతంగా నిలిపివేయించారు. పనులు కొనసాగిస్తే వాహనాలను తగులబెడతామని హెచ్చరికలతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.కాగా తమకు కాకుండా సీఎం రమేష్‌కు కాంట్రాక్ట్ పనులు అప్పగించడంపై స్థానిక టీడీపీ నేతలు చాలాకాలంగా అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది.