యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
కోహ్లీసేన నిర్దేశించిన 325 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో కివీస్ తడబడింది. తొలి సగంలో బ్యాట్స్మెన్, తర్వాత బౌలర్లు రాణించడంతో కోహ్లీసేనకు సునాయాస విజయం దక్కింది. కుల్దీప్ యాదవ్, చాహల్, భువి చెలరేగి ఆడిన వేళ కివీస్ 234 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా ఐదు వన్డేల సిరీస్లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. 87 పరుగులు చేసి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.