YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పద్మ పురస్కార గ్రహీతలకు చంద్రబాబు అభినందనలు

పద్మ  పురస్కార గ్రహీతలకు చంద్రబాబు అభినందనలు
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘పద్మ’ పురస్కారాలు పొందిన ‘తెలుగు’ ప్రముఖులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి పద్మశ్రీ పురస్కారాలు నలుగురిని వరించాయి. అందులో తెలంగాణ నుంచి పుట్బాల్ క్రీడాకారుడు సునీల్ ఛత్రి, సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ఆంధ్రప్రదేశ్ కోటాలో వ్యవసాయ రంగం తరుఫున యడ్లపల్లి వెంకటేశ్వరరావు, చదరంగ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక ఉన్నారు. ‘పద్మశ్రీ’ పురస్కారాలు లభించిన వారి జీవిత విశేషాలను సీఎంవో అధికారులు శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియజేశారు. ఆయా రంగాలలో విశేష ప్రతిభను కనబరచిన ఈ నలుగురు తెలుగు ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారాలు లభించడం పట్ల ముఖ్యమంత్రి సంతోషం వెలిబుచ్చారు. ప్రముఖ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఆలస్యంగానైనా అత్యుత్తమ పురస్కారం లభించడం విశేషమని అన్నారు. తెలుగుతేజంగా నిలిచిన చదరంగ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక, తన అసమాన ప్రదర్శనతో జట్టును విజయపథంలో నడిపిస్తున్న భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛత్రి, అత్యుత్తమ సేద్యపు విధానాలపై రైతాంగానికి అవగాహన కల్పిస్తున్న ‘రైతునేస్తం’ ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరావులను ‘పద్మశ్రీ’ వరించడం అభినందనీయమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

ప్రకృతి సేద్యాన్ని మరింత విస్తృతం చేసేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున జరుపుతున్న కృషికి యడ్లపల్లి వంటి నిపుణుల సహకారం ఎంతో అవసరమని ముఖ్యమంత్రి అన్నారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడుకు చెందిన యడ్లపల్లి వెంకటేశ్వరరావు 15 ఏళ్ల నుంచి రైతునేస్తం, ప్రకృతినేస్తం, పశునేస్తం పేరుతో మాస పత్రికలు నడుపుతున్నారని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అలాగే, గుంటూరుకు చెందిన హారిక చిన్ననాటి నుంచే చదరంగ క్రీడలో అసమాన ప్రతిభను కనబరుస్తూ అంచెలంచెలుగా గ్రాండ్మాస్టర్ హోదాకు చేరుకుందని వివరించారు. 2012, 2015, 2017 ప్రపంచ చెస్ చాంపియన్షిప్ పోటీలలో కాంస్య పతకాలతో రాణించిందని తెలిపారు. 2010లో తన హయాంలో జరిగిన ఆసియా గేమ్స్లో హారిక కాంస్య పతాకాన్ని అందుకున్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఆసియా కప్ పోటీలలో పుట్ బాల్ క్రీడలో ఛత్రి రికార్డు గోల్స్ (67)తో రాణించాడని తెలిపారు. ఇక తెలుగు నేపథ్యమున్న శరత్ కమల్ టేబుల్ టెన్నిస్ క్రీడలో గతేడాది కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం, రజతం, కాంస్యంతో మెరిసి ఇప్పుడు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంటున్నారని, అతన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు. 

ఇటు, పారిశ్రామిక రంగంలో తన పాత మిత్రుడు, సిస్కో మాజీ చైర్మన్ జాన్ ఛాంబర్స్ను పద్మభూషణ్ పురస్కారం వరించడం విశేషమని ముఖ్యమంత్రి అన్నారు

Related Posts