YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఫ్యాన్ గాలి కిందకు దగ్గుబాటి ఫ్యామలీ

ఫ్యాన్ గాలి కిందకు దగ్గుబాటి ఫ్యామలీ

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు., శాశ్వత శత్రువులు ఉండరంటారు.పదేళ్ల క్రితం ఎవరిని వ్యతిరేకిస్తూ జట్టు కట్టారో అదే వ్యక్తి పంచన చేరడానికి సిద్ధమవుతున్నారు. సైద్ధాంతిక విభేదాలు రాజకీయ పోరాటాలు పదవుల కోసమే తప్ప వాటికేమి ప్రత్యేక కారణాలుండవని తాజా పరిణామాలు గమనిస్తే అర్ధమవుతుంది.2009-2010 మధ్య కాలంలో ఉమ్మడి రాష్ట్రాన్ని ప్రభావితం చేసిన చాలా కీలక పరిణామాలు ఏపీలో జరిగాయి. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ముఖ్యమంత్రి పదవి ఆశించిన జగన్మోహన్ రెడ్డి అనుకున్నది నెరవేరలేదు. అదే సమయంలో 2004-2009 మధ్య వైఎస్ ను రకరకాల కారణాలతో విభేదించిన వారంతా ఏకమవడానికి వైఎస్ మరణం కలిసొచ్చింది. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన ఓదార్పు యాత్రపై….. కాంగ్రెస్ అధ్యక్షురాలు కన్నెర్ర చేయడానికి చాలామంది రాష్ట్ర నేతలు తమ వంతు ప్రయత్నాలు చేశారు. తెలంగాణ., ఆంధ్రా., రాయలసీమలలో వైఎస్ ను వ్యతిరేకించిన వారు., ముఖ్యమంత్రి పదవిని ఆశించిన వారు జగన్ కు వ్యతిరేకంగా ఏకమయ్యారు. వారందరిని ఏకం చేయడంలో అప్పటి కేంద్ర మంత్రి ఒకరు కీలక పాత్ర పోషించారు.వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారిని పరామర్శించే పేరుతో జగన్ ప్రారంభించిన ఓదార్పు యాత్ర.., రాజకీయంగా బలం పెంచుకోవడానికే అనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ముఖ్య మంత్రుల్ని తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని భావించే కాంగ్రెస్ పార్టీకి జగన్ వ్యవహార శైలి సహజంగానే నచ్చలేదు. అదే సమయంలో కాలం కాలిసొస్తే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుందామని భావించిన వారంతా జగన్ కు వ్యతిరేకంగా నూరిపోయడం., తమకు అనుకూల జట్టును తయారు చేసుకోడానికి ప్రయత్నించారు.రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి., పదవిలో ఉండగా మరణించాడు కాబట్టి అతను కాంగ్రెస్ పార్టీ సొత్తుగా కాంగ్రెస్ పార్టీ భావించింది. దీంతో జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రను నిలిపివేయాలని పార్టీ హైకమాండ్ ఆదేశించింది. రాజశేఖర్ రెడ్డి మరణించిన ఏడాది తర్వాత ఓదార్పు యాత్ర చేస్తున్న జగన్ ను ఢిల్లీ పిలిపించి సోనియా హెచ్చరించారు. జగన్ ను గట్టిగా హెచ్చరించడంతో…., సోనియా గాంధీని వైఎస్ షర్మిల ధిక్కరించి మాట్లాడినట్లు సన్నిహితులు చెబుతారు. వైఎస్ కుటుంబాన్ని వేధించే ప్రయత్నాలు చేస్తుండటంపై జగన్., షర్మిలలు సోనియాను నిలదీశారని అంటారు. ఆ తర్వాత రాజకీయంగా పరిణామాలు వేగంగా మారిపోయాయి. జగన్ ను రాజకీయంగా దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పార్టీ రకరకాల అస్త్రాలు ప్రయోగించింది. ఏఐసిసి కార్యాలయం కేంద్రంగా చాలా కుట్రలు నడిచాయి. జగన్ కు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించిన శంకర్రావు…., ఫిర్యాదులో ఏముందో కూడా తనకు తెలియదని బహిరంగంగానే ప్రకటించాడు.ఇదంతా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ధిక్కరించి జగన్ ఓదార్పు యాత్ర కొనసాగిస్తున్న క్రమంలో ఢిల్లీలో కూడా జోరుగా రాజకీయాలు నడిచాయి. జగన్ కు మద్దతుగా ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తున్న క్రమంలో వారిని నిలువరించేందుకు పార్టీ అధిష్టానం ఢిల్లీ పిలిపించింది. వారందరికి ప్రకాశం జిల్లాకు చెందిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు నేతృత్వం వహించారు. ఢిల్లీ ప్రగతి మైదాన్ సమీపంలో ఉన్న మథురా రోడ్డులోని మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఇంట్లో ఎమ్మెల్యేలతో దగ్గుబాటి దంపతులు సమావేశం నిర్వహించారు. ప్రకాశం కు చెందిన ఉగ్రనరసింహా రెడ్డి., ఆమంచి కృష్ణమోహన్., పనబాక లక్ష్మీతో పాటు పలువురు ఎంపీలు., ఎమ్మెల్యేలు జగన్ కు వ్యతిరేకంగా విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి పదవి ఏమి వారసత్వం కాదంటూ కారాలు మిరియాలు నూరారు. దగ్గుబాటు దంపతులైతే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తే పుట్టగతులుండవంటూ కారాలు మిరియాలు నూరారు. జగన్ వ్యవహారంపై విచారణ జరపాలంటూ., జగన్ ను సమర్ధించే వారంతా ద్రోహులేనని సర్టిఫికెట్ ఇచ్చారు. పత్రికల్లో రాయలేని భాషలో జగన్ ను దూషించిన ఎమ్మెల్యేలు సైతం ఇప్పుడు జగన్ శిబిరంలో చేరిపోయారు.జగన్ ఓదార్పు యాత్రను తప్పు పట్టే క్రమంలో దగ్గుబాటి దంపతులు కొన్నాళ్లకు మరో ముందడుగు వేసి వైఎస్ మరణంతో మరణించిన వారిని కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుందని ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలి అమోదంతో తలా రెండు లక్షల ఆర్ధిక సాయాన్ని పార్టీయే అందిస్తుందని., జగన్ ఇచ్చే సాయాన్ని తిరస్కరించాలని పిలుపునిచ్చారు. పదేళ్ల తర్వాత అన్ని మర్చిపోయారని భావించారో., వేరే దారి లేదనుకున్నారో కాని దగ్గుబాటి కుటుంబం వైసీపీకి దగ్గరవుతోంది. చంద్రబాబు దగ్గరకు వెళ్లేందుకు మోహం చాలక వెంకటేశ్వరరావు., ఆయన తనయుడు హితేశ్, వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. పర్చూరు నియోజక వర్గం నుంచి దగ్గుబాటి తనయుడు హితేష్ చెంచురామ్ ను బరిలో దింపాలని భావిస్తున్నా అవి నెరవేరేలా కనిపించడం లేదు. హితేష్ కు అమెరికా పౌరసత్వం ఆటంకంగా మారడంతో రాజకీయ సన్యాసం చేశానని ప్రకటించినా మళ్లీ పోటీ చేసేందుకుదగ్గుబాటి వెంకటేశ్వరరావు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి కూడా గుంటూరు పార్లమెంటు నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారని సమాచారం. మొత్తం మీద నాటి శత్రువు ఇప్పుడు జగన్ కు మిత్రుడయ్యారన్నది ఆనాటి రాజకీయ పరిణామాలకు మాత్రమే తెలిసిన విషయం.

Related Posts