Highlights
- 20 ప్రాజెక్టుల లక్ష్యం
- పోగొండ రిజర్వాయర్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టును 2019నాటికి పూర్తిచేస్తామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు. పోలవరం నుంచి గ్రావిటీ ద్వారా నీరిస్తామని, పట్టిసీమతో కృష్ణా-గోదావరిని నదులను అనుసంధానం చేశామని చెప్పారు. సోమవారం పోగొండ రిజర్వాయర్‌ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.
ప్రాధాన్యతాక్రమంలో 20 ప్రాజెక్టులను పూర్తిచేయాలని లక్ష్యం పెట్టుకున్నామని చెప్పారు. ముచ్చుమర్రి, పురుషోత్తపట్నం పూర్తిచేసుకున్నామని, అడవిపల్లి రిజర్వాయర్ పూర్తి కావొస్తోందని ఆయన తెలిపారు. పట్టిసీమ ద్వారా గుంటూరు, కృష్ణాలో పంటలను కాపాడామని, ఏపీని కరువురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు. చివరి ఆయకట్టు వరకు సాగు నీరిస్తామని, నీటిని పరిరక్షించుకుంటే కరువు అనే మాట ఉండదన్నారు. అన్ని చెరువులను గొలుసుకట్టు చెరువులుగా తీర్చిదిద్దుతామని, ఎక్కడికక్కడ నీటికుంటలు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పారు.