YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎలక్షన్ మూడ్ లో చంద్రబాబు

ఎలక్షన్ మూడ్ లో చంద్రబాబు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఎన్నికల మూడ్ లోకి దిగిన ఎపి సిఎం చంద్రబాబు తన రాజకీయ అనుభవాన్ని అంతా రంగరించేస్తున్నారు. కులాలు, మతాల వారీగా పార్టీకి దూరంగా జరుగుతున్నారని అనే అనుమానం వస్తే చాలు ఆయా వర్గాలపై వరాల జల్లు కురిపిస్తూ తిరిగి తన వలలోకి లాక్కునే పని పద్ధతిగా మొదలు పెట్టేశారు. అందులో భాగంగా జనసేన పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ తో కాపు సామాజికవర్గం బాగా దూరం అవుతుందని గుర్తించి వారికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి భారీగా సబ్సిడీ పంట పండించారు చంద్రబాబు. ఇక రిజర్వేషన్ల అంశం లో కూడా ఆర్ధిక వెనుక బాటు వున్న అగ్రవర్ణాలకు కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు ఇచ్చి తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా నని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు బాబు. వాస్తవానికి బిసిల్లో చేరుస్తా అన్న హామీ వదిలి ఓసీల్లోనే వారిని ఉంచి కేంద్రం ఇచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నారు టిడిపి అధినేత.గోదావరి జిల్లాల్లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్ర బిసి ఓటు బ్యాంక్ లక్ష్యంగా సాగిందని టిడిపి కొంత ఆలస్యంగా గుర్తించింది. తనను కలిసిన బిసి సంఘాల నాయకులకు, కుల సంఘాల నాయకులకు జగన్ ఇవ్వని వరం లేదు. ప్రతి కులానికి తమ ప్రభుత్వం వస్తే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించి అందరిని ఆకట్టుకున్నారు. దాంతో వైసిపి వైపు నెమ్మదిగా టిడిపి ఓటు బ్యాంక్ టర్న్ కావడం మొదలైంది. ఈ నేపథ్యంలో ఒక భారీ కార్యక్రమం ద్వారా తమ ఓటు బ్యాంక్ ను సుస్థిరం చేసుకోవాలని వ్యూహాత్మకంగా కార్యాచరణ రూపొందించారు చంద్రబాబు.రాజమండ్రి వేదికగా రాష్ట్ర బిసి సదస్సుకు శ్రీకారం చుట్టారు టిడిపి అధినేత. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా సమీకరించిన బిసిలతో ఈ సదస్సులో తమ పార్టీ బిసిలకు చేయబోయే మేలును చేసిన పనులు చెప్పుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు బాబు. జగన్ ప్రకటించిన కులానికో కార్పొరేషన్ ఏర్పాటు ను ఇదే వేదిక నుంచి పసుపు దళపతి ప్రకటించనున్నట్లు టిడిపి వర్గాల్లో ప్రచారం సాగుతుంది. ఆ కార్పొరేషన్ లకు జనాభా మేరకు నిధుల కేటాయింపును ప్రకటిస్తారని తెలుస్తుంది. మూడు లక్షల మందితో ఈ సదస్సు నిర్వహించాలని టిడిపి భావిస్తున్నా జనసమీకరణ ఏ మేరకు సాగుతుందో అన్నది సదస్సు అనంతరమే తేలనుంది.

Related Posts