YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పవన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఎట్ హోం

 పవన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఎట్ హోం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

కేసీఆర్ - జగన్ కలవటం ఏంటి, నాకు రాయబారం పంపటం ఏంటి అంటూ, వారం క్రితం పవన్ మాట్లాడిన మాటలు గుర్తుండే ఉంటాయి. అయితే ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్, కేసీఆర్, కేటీఆర్ తో కలిసి ముచ్చట్లు, నవ్వులు, పువ్వులు పూయించారు. కలిసినప్పుడు మాట్లాడుకోవటం వేరు కాని, వీరి మధ్య జరిగిన సంభాషణ చూస్తే మాత్రం, వీళ్ళు మాట్లాడే మాటలకి, చేసే చేతలకి పొంతన లేదు అనిపిస్తుంది. ఈ అరుదైన కలయిక, గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ఎట్‌ హోం కార్యక్రమంలో జరిగింది. ఈసందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రత్యేకంగా మాట్లాడారు. ఇది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది.అటు సీఎం.. ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇద్దరూ కాసేపు పలు విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీలో గత కొద్దిరోజులుగా జరిగిన రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. ఇలా కేటీఆర్‌‌తో.. కేసీఆర్‌ ఇద్దరితో సుమారు అరగంటకు పైగా పవన్ చర్చించినట్లు తెలుస్తోంది. అయితే రాజకీయ వర్గాలు మాత్రం, చంద్రబాబుకి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ పై, దాంట్లో పవన్ పాత్ర పై చర్చించారేమో అని గుసగుసలాడుతున్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌కు మద్దతివ్వాలని కేటీఆర్‌ ఇటీవల జగన్‌ను కలిసి మద్దతు కోరారు. దీంతో తెరాస.. వైకాపా ఒక్కటయ్యాయని టీడీపీ విమర్శించింది. తెరాస.. వైకాపా కలయికను జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా తప్పుబట్టారు. తెనాలి వెళ్లిన పవన్‌... పెదరావూరు సభలో కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ... తెరాసను దెబ్బతీసేందుకు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రయత్నించారు. వైఎస్‌ జగన్‌ వరంగల్‌ జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు తెరాస నేతలు అడ్డుకున్నారు. తెలంగాణలో జగన్‌ను అడుగుపెట్టనీయబోమని ప్రకటించిన నేతలే ఇప్పడు ఆయనకు సపోర్టు చేస్తున్నారు అని విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు తప్పకుండా రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తామని, ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇటీవల సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై తొలిసారి ప్రకటన చేసినప్పుడు పవన్‌ కల్యాణ్‌ స్వాగతించారు. కానీ, ఆ తర్వాత ఎప్పుడూ దానిపై స్పందించలేదు. ఈ నేపథ్యంలో, ఇప్పుడు పవన్‌ కల్యాణ్ కేసీఆర్‌, కేటీఆర్‌తో చాలాసేపు మాట్లాడటం చర్చనీయాంశమైంది. పవన్‌ కల్యాణ్‌‌ వారిద్దరితో ఏం మాట్లాడి ఉంటారనే అంశంపై రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఈ విందుకు చంద్రబాబు హాజరుకాలేదు

Related Posts