యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న మూడో వన్డేలో కివీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మూడో వన్డేలో కేన్ సేన భారత బౌలర్ల ధాటికి విలవిల్లాడింది. 49 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియాకు 244 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు తీయగా.. భువనేశ్వర్, చాహల్, పాండ్యా తలో రెండేసి వికెట్లు పడగొట్టారు.