YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రజల్లోకి బీసీ హామీలు

 ప్రజల్లోకి బీసీ హామీలు
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఆదివారం  జరిగిన ‘‘జయహో బీసి’’ చారిత్రాత్మక సభ. విజయవంతం చేసిన అందరికీ అభినందనలు.  జయహో బీసి స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. పోమవారం అయన ఎలక్షన్ మిషన్ 2019 పై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ 
బీసిలకు ఇచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. చేనేతలకు, నాయీ బ్రాహ్మణులకు 150యూనిట్ల ఉచిత విద్యుత్ స్వర్ణకారులు, ఎంబిసిల ఇళ్లకు 100యూనిట్ల ఉచిత విద్యుత్రూ.100కోట్లతో జ్యోతిరావు పూలే స్మృతి వనం లాంటి అంశాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని అయన అన్నారు. బీసి ఫెడరేషన్లను కార్పోరేషన్లుగా మార్చడం. కొత్తగా యాదవ, శెట్టిబలిజ, చేనేత, తదితర కార్పోరేషన్లు ఏర్పాటు కానుందని అయన అన్నారు. బీసి సబ్ ప్లాన్ కు చట్టబద్దత ఇస్తాం. బీసి హామీలన్నింటినీ ఫ్లెక్సీలతో ప్రచారం చేస్తామని అన్నారు. రాజమండ్రి సభ 'మూడ్ ఆఫ్ ది స్టేట్'కు నిదర్శనమని చంద్రబాబు అన్నారు. 50 శాతం బలంతో టీడీపీ ఓటింగ్ ప్రారంభం అవుతుందని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఏకపక్షం కానుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. 50% బలంతో టిడిపి ఓటింగ్ ప్రారంభం అవుతుంది. రాబోయే ఎన్నికల్లో టిడిపి గెలుపు ఏకపక్షం కానుంది.  ప్రజలకు టిడిపిపై ఉన్న నమ్మకాన్ని బైటపెట్టింది
ఈ నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. బీసిల ఐక్యతను దెబ్బతీయాలనే కుట్ర జరుగుతోంది.  బీసిలపై వైసిపి,టిఆర్ ఎస్ కుట్రలను తిప్పికొట్టాలని అన్నారు. టిఆర్ ఎస్ 29కులాలను బీసి జాబితా నుంచి తొలగించింది. టిఆర్ ఎస్ తో జగన్ కలయిక బిసి వ్యతిరేకమని అయన విమర్శించారు. ఆ 29కులాల్లో వైసిపి పై తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రజలను మభ్యపెట్టాలనేదే జగన్ అజెండా.*దీనిపై బీసిలను చైతన్యపరచాలి. 
అభివృద్ధిపై జగన్ కు ఒక అజెండా అనేదే లేదు. కుట్రలు,కుతంత్రాలే వైఎస్సార్ కాంగ్రెస్ అజెండా. అధికారం కోసమే దగ్గుబాటి కుటుంబం వైసిపిలో చేరిక. దగ్గుబాటి మారని పార్టీలు లేవు. ఆర్ ఎస్ ఎస్ మొదలు అన్నిపార్టీల ప్రదక్షిణలు. బిజెపి-కాంగ్రెస్-బిజెపి-ఇప్పుడు వైసిపి అని అయన అన్నారు. కాంగ్రెస్ లో ఆమె కేంద్రమంత్రి, ఈయన ఎమ్మెల్యే. తరువాత కాంగ్రెస్ ను వదిలేసి బీజేపిలోకి. ఇప్పుడు మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్. అధికారం కోసమే వీళ్ల ఫిరాయింపులన్నీ. అధికారం కోసమే లక్ష్మీపార్వతి వైసిపితో కుమ్మక్కు అవకాశవాదంతోనే ఆనాడు ఎన్టీఆర్ ను వాడుకున్నారని విమర్శించారు. వీళ్ల అవకాశవాదంతో ఎన్టీఆర్ కు అప్రతిష్ట. అవకాశ వాదులంతా వైసిపి గూటికి చేరారు. వాళ్ల డొల్లతనాన్ని ప్రజల్లో ఎండగట్టాలని అయన అన్నారు. 

Related Posts