YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సాంకేతికతను ప్రకృతితో అనుసంధానం

సాంకేతికతను ప్రకృతితో అనుసంధానం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ప్రకృతి సేద్యం ప్రపంచానికి భారతదేశం తరఫున మనం అందించే కానుక. ప్రకృతి సేద్యం వల్ల ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యం. సాంకేతికతను ప్రకృతికి అనుసంధానం చేస్తున్నాం. ప్రపంచమంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అధికారులు బాధ్యత తీసుకుని ప్రకృతి సేద్యంపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. సోమవారం అయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో ప్రజలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన సమస్యలన్నింటినీ సత్వరం పరిష్కరించాలి. జన్మభూమిలో వచ్చిన సమస్యల్ని పరిష్కారం చేయాలి. చేయలేనివాటిని ఎందుకు చేయలేదో ప్రజలకు తెలియజేయాలి. ప్రత్యేక హోదా సాధన సమితి ఫిబ్రవరి 1న బంద్కు పిలుపు ఇచ్చింది.  దానికి ఇబ్బంది లేకుండా 2, 3, 4 తేదీలతో జన్మభూమి సమస్యల పరిష్కారానికి పూనుకోవాలి. అన్న క్యాంటీన్ల పెండింగ్ ఇష్యూస్ వెంటనే పరిష్కరించాలని అదేశించారు. ఆదరణ, ఇతర సంక్షేమ కార్యక్రమాలపై క్షుణ్ణంగా సమీక్షించుకుని చివరి లబ్ధిదారుని వరకు చేరేలా చూడాలి. వచ్చే ఖరీఫ్ సీజనుకు ఏం చేయగలుగుతామో ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాలి. ఎక్కడా నీటికి ఇబ్బంది వుండే పరిస్థితి రాకూడదు. 
పశుపోషణకు అస్సలు నీటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలి. బీసీలు ఎప్పటి నుంచో అడుగుతున్నందున కొత్తగా కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తున్నాం. జనాభా దామాషా ప్రకారం పేదరిక నిర్మూలన కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తాం. కాపు రిజర్వేషన్లకు చట్టబద్దత ఇవ్వాలి. ఈ అంశాన్ని శాసనసభకు తీసుకొస్తున్నాం. సమాజంలో ఎవరూ కూడా మేము పేదవాళ్లం, మాకు గుర్తింపు లేదని బాధ కూడదు.అగ్రవర్ణాలలో వున్న పేదలకు కూడా సంక్షేమ ఫలాలు అందిస్తామని అయన వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ మాదిరిగా బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తున్నాం. ఎంబీసీలకు నెలకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించాం. బీసీల విదేశీవిద్యకు రూ.15 లక్షల వరకు సహాయం అందిస్తాం. 100 కోట్లతో పూలే స్మారక కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. కొత్తగా 69 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నాం.   ఇప్పుడు 106 గురుకులాలు ఉన్నాయి.  హామీల అమలుకు ఈ బడ్జెట్లోనే నిధులు కేటాయిస్తామని అన్నారు. విజయనగరంలో ఆనాడు సంగీత కళాశాల పెడితే ఘంటసాల, సుశీల వంటి ప్రసిద్ధ గాయకులు అక్కడి నుంచి వచ్చి కీర్తిప్రతిష్టలు సాధించారు. మన సంప్రదాయ సంగీత కళలకు ప్రాధాన్యం ఇవ్వాలి. డోలు, సన్నాయి వంటి సంగీత కళలకు ఇప్పటికీ ఎంతో డిమాండు వుందని అయన అన్నారు.

Related Posts