YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బీసీలపై చర్చకు సిద్దం

 బీసీలపై చర్చకు సిద్దం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

రాజశేఖర్ రెడ్డి  హయాంలో ఫెడరేషన్ ల పేరుతో బీసీలను ఉద్దరిస్తామని చెప్పి ఫెడరేషన్ లను నిర్వీర్యం చేశారు. అన్ని ఫెడరేషన్ లకు ఛైర్మన్ లను నియమించి, బడ్జెట్ లో నిధులు కేటాయించిన ఘనత చంద్రబాబు నాయుడిది. ఫెడరేషన్ లను కార్పోరేషన్ లుగా మారుస్తామన్న చంద్రబాబు నాయుడి గారికి ప్రత్యేక ధన్యవాదాలని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ అన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆదరణ పథకాన్ని రద్దు చేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం. ఇప్పుడు ఆదరణ పథకం ద్వారా రూ.750 కోట్ల ఖర్చు చేసింది చంద్రబాబు నాయుుడు ప్రభుత్వం. చేతివృత్తిదారులకు జీవనోపాధి కల్పించేందుకు చర్యలు తీసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు కి ప్రత్యేక కృతజ్ఞతలు. వైఎస్ఆర్ హయాంలో 23 జిల్లాలకు ఫీజు రీఎంబర్స్ మెంట్ కింద 19 లక్షల మందికి 1400 కోట్లు ఖర్చుపెట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో 13 జిల్లాలకు గాను రూ.4వేల కోట్లు ఖర్చుపెట్టారు. 32 లక్షల మంది లబ్ధి పొందారు. *గత ప్రభుత్వాలలో విదేశీ విద్య అందని ద్రాక్ష.  చంద్రబాబు నాయుడు హాయాంలో విదేశీ విద్య కోసం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు సాయం అందజేసారని గుర్తు చేసారు. గతంలో 23 జిల్లాలో ఉన్న బీసీలకు రూ.1800 కోట్లు కేటాయించి.. రూ.1600 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో రూ.40వేల కోట్లు వరకూ కేటాయించి రూ.32వేల కోట్లు వరకూ ఖర్చు పెట్టారు. బీసీలకు ఇంతకు ముందు రాజకీయ నాయకత్వం లేదు. ఎన్టీఆర్  వచ్చిన తర్వాత రాజకీయంగా బీసీ నాయకత్వం పెంచాలన్న ఆలోచనతో స్థానికసంస్థలలో 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే.. చంద్రబాబు నాయుడు గారు 33 శాతానికి పెంచారు. వైఎస్సార్ హయాంలో అరకొర మందిని బీసీ మంత్రులుగా చేసి వారిని జైలు పాలు చేశారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఉపముఖ్యమంత్రి పదవితో కలిపి 8 మంత్రి పదవులు బీసీ నాయకులకు ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాలంలో ముగ్గురికి టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. ధర్మాన ప్రసాదరావు,  పార్థసారథి  చెప్పడానికి ఏమీ లేక అవాస్తవాలను ప్రసారం చేస్తున్నారు.  బీసీలకు మీరు ఏమిచేశారో చర్చకు సిద్ధమైతే.. మేము కూడా చర్చకు సిద్ధమని ఆమె అన్నారు. ఫెడరేషన్ లను కార్పోరేషన్ లుగా మార్పుచేసి వాటికి రూ.3వేల కోట్లు కేటాయించినందుకు చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు. బీసీల ఉన్నతికి ఇంకా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు. చేనేత కార్మికులకి, రజకులకి 100 నుంచి 150 యూనిట్లు.. ఇలాంటి హామీలు ఎన్నో ఇచ్చారు. అమరావతిలో 10 ఎకరాలలో మహత్మాజ్యోతీరావు పూలే గారి స్మృతివనం, విగ్రహం ఏర్పాటు చేస్తామన్న సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు. బీసీ భవన్ కు 100 కోట్ల కేటాయించిన ఘనత సీఎం చంద్రబాబుది. బీసీలకు వైఎస్సార్ గానీ, జగన్ గానీ ఏమీ చేయలేదని ప్రజలందరికీ తెలుసు. బీసీలకు చేసింది ఏమిచెప్పుకోవాలో తెలియక, ఏమీ లేక ఈ రోజు కేసీఆర్ గారిని పొగడటం మొదలు పెట్టారు. తెలంగాణలో 26 బీసీ కులాలను ఓసీలుగా కలిపిన అత్యంత నీచ చరిత్ర కేసీఆర్ గారిది. అటువంటి కేసీఆర్ ని ఈ రోజు ధర్మాన ప్రసాదరావు పొగుడుతున్నారు. తెలంగాణలో కలిపిన అవే కులాలకి ఇక్కడ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు. జగన్ మోహన్ రెడ్డి కేసీఆర్ తో కలిసింది, ఈ 26 బీసీ కులాలను ఓసీలో కలపడానికా అని ప్రశ్నించారు. 
బీజేపీ నేతలకు బీసీలపై ప్రేమ ఉంటే జాతీయ బీసీ కమిషన్ కు రాజ్యాంగ బద్దత కల్పిస్తామన్న వాగ్ధానాన్ని నిలబెట్టుకోండి. బీజేపీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోండి.
జాతీయ బీసీ కమిషన్ కు రాజ్యాంగ బద్దతపై ప్రధాని మోదీ కి టీడీపీ తరపున మీరు ఢిల్లీలో చెప్పండి. దగ్గుబాటి కుటుంబానికి కమిట్ మెంట్ లేదు. హార్డ్ వర్క్ చేయరు. కార్యకర్తలను కలుపుకోరు. వైజాగ్ లో ఉన్న వీఐపీ క్రీమ్, వాల్తేరు క్లబ్ మెంబర్స్ తో కూర్చుని మాట్లాడుకోవడం తప్ప.. వాళ్లు ఏ పార్టీలో ఉన్న కార్యకర్తలతో మమేకం అవ్వరని ఆమె ఆరోపించారు. 

Related Posts