యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి పనిచేస్తామని చెప్పడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఆయన ఊసరవెల్లి కంటే ఎక్కువగా రంగులు మార్చగల నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. అయితే వైసీపీలో వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు హితేష్ చెంచురామ్ చేరతుండటాన్ని ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆదివారం కుమమారుడు హితేష్‌తో పాటు వెళ్లి వైఎస్ జగన్‌ను కలవడంతో ప్రకాశం జిల్లా పర్చూరులో నిరసన సెగ మొదలైంది. వెంకటేశ్వరరావు సొంత నియోజకవర్గం, గతంలో పలుమార్లు అక్కిడినుంచి గెలిచిన స్థానం కావడంతో కుమారుడిని పర్చూరు నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక రోటరి భవన్‌లో పర్చూరు వైసీపీ నేతలు సమావేశమయ్యారు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ దగ్గుబాటి ఉంటారని, ప్రస్తుతం స్వప్రయోజనాల కోసమే వైసీపీలో చేరుతున్నారని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ఎప్పటినుంచో పని చేస్తున్నవారికి అన్యాయం చేయవద్దని వైసీపీ అధినేత జగన్‌ను కోరుతున్నారు. దగ్గుబాటి కుటుంబానికి టికెట్ ఇవ్వరాదని, పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తికే కేటాయించాలని అభిప్రాయపడ్డారు. కాగా, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు హితేష్ వైసీపీలో చేరుతుండగా.. ఆయన భార్య దగ్గుబాటి పురందేశ్వరి మాత్రం బీజేపీలోనే కొనసాగుతారని స్పష్టం చేశారు. దగ్గుబాటి రాకను వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా పర్చూరులో ఉన్న రోటరీ భవన్ లో ఈరోజు వైసీపీ నేతలు సమావేశమయ్యారు. అధికారం ఎక్కడుంటే దగ్గుబాటి అక్కడుంటారని ఈ సందర్భంగా వారు అసహనం వ్యక్తం చేశారు. పార్టీ కోసం పని చేస్తున్నవారికి అన్యాయం చేయవద్దని పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. దగ్గుబాటి కుటుంబానికి టికెట్ ఇవ్వడం మంచిది కాదని విన్నవించారు.