యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ వేయకుండా అంబటి రాయుడిపై ఐసీసీ నిషేధం విధించింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో రాయుడు బౌలింగ్ యాక్షన్ అనుమానాస్పదంగా ఉందని ఫీల్డ్ అంపైర్లు మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ విషయం ఐసీసీకి చేరింది. వెంటనే స్పందించిన క్రికెట్ కౌన్సిల్.. అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ కొనసాగించాలంటే 14 రోజుల వ్యవధిలో నిర్దేశించిన టెస్టుకి హాజరు కావాలని రాయుణ్ని ఆదేశించింది. కానీ గడువులోగా రాయుడు బౌలింగ్ యాక్షన్ టెస్టుకు హాజరుకాలేదు. దీంతో బౌలింగ్ చేసేందుకు వీల్లేకుండా ఐసీసీ రాయుడిపై సస్పెన్షన్ విధించింది. ఐసీసీ నిబంధనల్లో 4.2 క్లాజ్ ప్రకారం సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వస్తుందని కౌన్సిల్ తెలిపింది. బౌలింగ్ యాక్షన్ టెస్టుకి హాజరై మోచేతిని నిబంధనలకు అనుగుణంగానే వంచుతాన్నడాని రూఢీ అయ్యేంత వరకూ రాయుడిపై వేటు కొనసాగనుంది. దేశవాళీ క్రికెట్లో మాత్రం బీసీసీఐ అనుమతితో అంబటి రాయుడు బౌలింగ్ చేయొచ్చని ఐసీసీ వివరణ ఇచ్చింది.తెలుగు ఆటగాడు, టీంఇండియా క్రికెటర్ అంబటి రాయుడు ఐసిసి( ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) నిషేదానికి గురయ్యాడు. అతడి బౌలింగ్ యాక్షన్ పై అనుమానాలు వ్యక్తం చేసిన ఐసిసి అంతర్జాతీయ క్రికెట్ లో బౌలింగ్ చేయకుండా నిషేదం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. కొద్దిరోజుల క్రితం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో రాయుడు వేసిన ఆఫ్ స్పిన్ బౌలింగ్ యాక్షన్ పై అభ్యంతరం వ్యక్తమయ్యింది. దీంతో ఐసిసి అతడిపై చర్యలకు దిగింది. అతడి బౌలింగ్ యాక్షన్‌పై భారత జట్టు మేనేజ్‌మెంట్ కు నివేదిక ఇవ్వడంతో పాటు...14 రోజుల్లో ఐసిసి నిర్వహించే పరీక్షకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది.అయితే బిజీ షెడ్యూల్ కారణంగా ఐసిసి నోటీసులను పట్టించుకోని రాయుడు బౌలింగ్ టెస్ట్ కు హాజరుకాలేదు. దీంతో అంతర్జాతీయ క్రికెట్ నియమ నిబంధనల మేరకు అంతర్జాతీయ మ్యాచుల్లో అతడు బౌలింగ్ చేయకుండా నిషేధం విధిస్తున్నట్లు ఐసిసి ప్రకటించింది. ఈ నెల 13వ తేదీ వరకు తన బౌలింగ్ పరీక్షకు హాజరయ్యేందుకు అంబటి రాయుడికి అవకాశమిచ్చినట్లు ఐసిసి అధికారులు తెలిపారు. అయితే ఆ సమయంలోపు అతడు పరీక్షకు హాజరుకాకపోవడం వల్ల బౌలింగ్ పై నిషేధం విధించింనట్లు వెల్లడించారు. ఆస్ట్రేలియా పర్యటన ముగియగానే భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. భారత జట్టుతో పాటు రాయుడు కూడా న్యూజిలాండ్ వెళ్లాడు. ఇలా బిజీ షెడ్యూల్ నేపథ్యంలో అతడు ఐసిసి బౌలింగ్ పరీక్షకు హాజరుకాలేక పోయాడు. ఇంతోలనే అతడిపై నిషేధం పడింది.