YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఓటమి నుంచి తేరుకున్న కమలం

 ఓటమి నుంచి తేరుకున్న కమలం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఇటీవల ఓటమి నుంచి కుంగిపోకుండా కమలం పార్టీ క్రమంగా తేరుకుంటోంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్,రాజస్థాన్ లలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మధ్యప్రదేశ్ లో కమల్ నాధ్, రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ లు ముఖ్యమంత్రులుగా బాధ్యతలను స్వీకరించారు. సీఎంలుగా పదవి చేపట్టిన వెంటనే రైతు రుణమాఫీని అమలుచేశారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను క్రమంగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. కానీ లోక్ సభ ఎన్నికలకు వచ్చే సరికి కమలం పార్టీ తిరిగి పుంజుకునే అవకాశాలున్నాయనిభావించిన కాంగ్రెస్ పార్టీ వెంటనే హామీలు అమలుపర్చేందుకు రెండు రాష్ట్రాల్లో సిద్ధమయింది.
రెండు రాష్ట్రాల్లో ఓటమి పాలయిన కమలం పార్టీ తిరిగి బలం పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. మధ్యప్రదేశ్ లో దశాబ్దాలుగా అధికారంలో ఉండటంతో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు కాంగ్రెస్ కు పట్టంకట్టారు. కొద్ది తేడాతో అధికారం బీజేపీకి తప్పింది. కాంగ్రెస్ బీఎస్పీ సహకారంతో ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రస్తుత ముఖ్యమంత్రి కమల్ నాధ్ లువచ్చే లోక్ సభ ఎన్నికలపై కన్నేశారు.శివరాజ్ సింగ్ చౌహాన్ ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల పర్యటనను చేపట్టారు. మధ్యప్రదేశ్ లో మొత్తం 29 పార్లమెంటు స్థానాల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలని కమలం పార్టీ గట్టిగానే ప్రయత్నిస్తుంది. ఇక హస్తం పార్టీ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. లోక్ సభ ఎన్నికల్లోనూ తమదే పైచేయి అని కాంగ్రెస పార్టీ ధీమాగాఉంది.మరో రాష్ట్రమైన రాజస్థాన్ లోనూ బీజేపీ అంత ఘోరంగా ఏమీ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోలేదు. అప్పటి ముఖ్యమంత్రి వసుంధరరాజే పై ఉన్న వ్యతిరేకత కారణంగానే అధికారానికి దూరమవ్వాల్సి వచ్చందని కమలం పార్టీ కేంద్ర నాయకత్వం తమ విశ్లేషణల్లో తేల్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని సవాలుగా తీసుకున్న కమలం పార్టీ ఇప్పటికే రాజస్థాన్ లో పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా భాధ్యులను నియమించింది. సంఘ్ పరివార్ ను కూడా రంగంలోకి దించింది. గత అసెంబ్లీ ఎన్నికలలో ఎక్కడ ఓట్లకు గండిపడ్డాయో అక్కడ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. ఇక ఇక్కడ మోదీ తీసుకువచ్చిన అగ్రవర్ణాల రిజర్వేషన్లు వచ్చే ఎన్నికల్లో బాగా పనిచేస్తుందని కమలం పార్టీ ఆశతో ఉంది. రాజస్థాన్ లో మొత్తం 25 పార్లమెంటు నియోజకవర్గాలున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉండటంతో మెజారిటీ స్థానాలను గెలుచుకుంటామన్న విశ్వాసాన్నివ్యక్తం చేస్తోంది.రెండు రాష్ట్రాల్లో కమలం పార్టీదే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పైచేయిగా ఉంటుందన్నది సర్వేలు చెబుతున్నాయి. తాజాగా విడుదలయిన సీ ఓటరు సర్వేలోనూ ఇదే స్పష్టమవుతోంది. మధ్యప్రదేశ్ లోని 29 పార్లమెంటు స్థానాల్లో 23 బీజేపీ, 6 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటుంది. రాజస్థాన్ లోని 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో 18 స్థానాల్లో బీజేపీ, ఏడు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు బాట పట్టే అవకాశముంటుందని తేల్చింది. కేవలం సర్వేలే కాకున్నా.. లోక్ సభ ఎన్నికలు వచ్చేసమయానికి మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో మోదీ టీం తిరిగి పుంజుకుంటుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండు నెలలు సమయం ఉండటంతో ఈక్వేషన్లు మారే అవకాశాలు లేకపోలేదు

Related Posts