యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు తూర్పు గోదావరి జిల్లాలో చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. జీవితంలో చేసిన అతి పెద్ద పొరపాటు ప్రాంతీయ పార్టీని ప్రోత్సహించి ఎన్టీఆర్ తో తెలుగు దేశం పార్టీని స్థాపించడమేనని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటన ల పేరిట, పారిశ్రామిక సదస్సులు నిర్వహించి ప్రజా ధనం దుర్వినియోగం చేయడం సరి కాదని అన్నారు. ప్రధానిని విభేదించడం రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. రాబోయే రోజులలో రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అది ఏ పార్టీ అనేది రాబోయ్ రోజులలో స్పష్టత వస్తుందని చెప్పారు. వ్యక్తుల చరిత్ర సినిమా తీయాలనుకుంటే వారి అనుమతి తప్పనిసరి అని బీహార్ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపధ్యంలో రాబోయే రాజకీయ మైన చిత్రాలలో నా పాత్రపై మా న్యాయవాదులు చూసుకుంటారని అన్నారు. చంద్రబాబు బీసీ ప్రధానిని వ్యతిరేకిస్తూ , బీసీ సమావేశాలు పెట్టడం బీసీ కార్పొరేషన్ లు ప్రకటించడం విచిత్రంగా ఉందని అన్నారు.