యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
చంద్రబాబు ప్రభుత్వం కాపులపై కక్షగట్టి పనిలో ఉందని కనీసం మా జాతికి ఇచ్చిన రిజర్వేషన్లు చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయకపోవడంతో భవిష్యత్ కార్యచరణపై ఈనెల 31వ తేదీన చలో కత్తిపూడి పిలుపుమేరకు కిర్లంపూడిలో తిరిగి మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. 31న కాపులతో ముద్రగడ సమావేశం ఏర్పాటు చేయనున్నారన్న సమాచారం మేరకు మూడు రోజులు ముందుగానే మళ్లీ కిర్లంపూడి లో ఇప్పటికే వందలాది మంది పోలీసులు కిర్లంపూడి లో పహారా ఏర్పాటు చేశారు. ముద్రగడ నివాసం బయట ఇప్పటికే ఎదురుగా ఉన్న స్తంభాలకు 3కెమెరాలను ఏర్పాటు చేశారు. ముద్రగడ నివాసంలోకి వెళ్లే వారిని బయటి వారిని పోలీసులు విచారించే పనిలో ఉన్నారు. ముద్రగడ తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని కాపు జాతి యావత్తు ఆయన అభిమానులు కార్యకర్తలు ఎదురుచూస్తున్న తరుణంలో చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని కాపులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.