YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

భ‌ర్త‌ను భార్య చంపితే అది మ‌ర్డ‌ర్ కాదు సుప్రీంకోర్టు సంచలన తీర్పు

భ‌ర్త‌ను భార్య చంపితే అది మ‌ర్డ‌ర్ కాదు         సుప్రీంకోర్టు సంచలన తీర్పు

 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

భ‌ర్త‌ను భార్య చంపితే అది మ‌ర్డ‌ర్ కాదు అని, కానీ ఆ ఘ‌ట‌న‌ను ఓ న‌ర‌హ‌త్య‌గా భావించాల‌ని ఓ తీర్పులో సుప్రీంకోర్టు వెల్ల‌డించింది. తమిళ‌నాడు కేసులో సుప్రీం ఈ తీర్పును ఇచ్చింది. కూతురు ముందే భార్య‌ను ఆమె భ‌ర్త వ్య‌భిచారిణి అని నిందించిన‌ప్పుడు ఆ మ‌హిళ త‌న భ‌ర్త‌ను చంపేస్తే అప్పుడు అది హ‌త్య కాదు అని సుప్రీంకోర్టు తెలిపింది. మ‌న‌ స‌మాజంలో ఏ మ‌హిళ కూడా వ్య‌భిచారిణి అని అనిపించుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌దు అని, ఆ మాట విన‌లేక మ‌హిళ త‌న కోపాన్ని భ‌ర్త‌పై చూపించింద‌ని కోర్టు తీర్పునిచ్చింది. వాస్త‌వానికి ఆ మ‌హిళ మ‌రో వ్య‌క్తితో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్న‌ది. ఆ విష‌యం భ‌ర్త‌కు తెలిసింది. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వైంది. ఆ స‌మ‌యంలో ఆ మ‌హిళ ల‌వ‌ర్ కూడా ఆ ఘ‌ర్ష‌ణ‌లో పాల్గొన్నాడు. అక్క‌డే ఆమె కూత‌రు కూడా ఉన్న‌ది. భ‌ర్త తీవ్ర స్థాయిలో తిట్ట‌డంతో మ‌న‌స్తాపానికి గురైన భార్య త‌న ల‌వ‌ర్‌తో క‌లిసి భ‌ర్త‌ను హ‌త్య చేసింది. ఫ్రెండ్ కారులో భ‌ర్త‌ను కాల్చేసిన ఆమె త‌న నేరాన్ని కోర్టు ముందుకు ఒప్పుకున్న‌ది. ఈ కేసులో మ‌ద్రాసు కోర్టు ఆ మ‌హిళ‌కు, త‌న ల‌వ‌ర్‌కు జైలు శిక్ష విధించింది. దీన్ని స‌వాల్ చేస్తూ సుప్రీంను ఆశ్ర‌యించారు. ఆ కేసును విచారించిన శంత‌న్‌గౌడ‌ర్‌, దినేశ్ మ‌హేశ్వ‌రిల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఇవాళ సుప్రీంలో తీర్పునిచ్చింది. వ్య‌భిచారి అని పిల‌వ‌డం వ‌ల్ల మ‌హిళ స‌డెన్‌గా ఆవేశానికి లోనైంద‌ని, దాంతో ఆమె భ‌ర్త‌పై అటాక్ చేసింద‌ని సుప్రీం వెల్ల‌డించింది. ఆ మ‌హిళ‌పై న‌మోదు అయిన మ‌ర్డ‌ర్ కేసును కొట్టివేస్తూ దాన్ని క‌ల్ప‌బుల్ హోమిసైడ్‌గా తీర్పును మార్చింది. జైలు శిక్ష‌ను కూడా ప‌దేళ్ల‌కు త‌గ్గించారు.

Related Posts