YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్రియాంకకు టీ కాంగ్రెస్ బాధ్యతలు

 ప్రియాంకకు టీ కాంగ్రెస్ బాధ్యతలు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ దూకుడు పెంచింది. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవలే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంకా గాంధీకి త్వరలోనే కీలక బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం వస్తోంది. ఇప్పటికే ప్రియాంకకు తూర్పు యూపీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిగా బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలకు ఢిల్లీ నుంచి పిలుపువచ్చింది. 2019, ఫిబ్రవరి మొదటి వారంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో వారు భేటీ కానున్నారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్‌గా ఫోకస్ పెట్టినట్టు అర్థమవుతుంది.ఢిల్లీ వెళ్లే వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఏఐసీసీ సెక్రటరీలు ఉన్నారు. ప్రియాంకకు బాధ్యతలు అప్పగించే విషయంపై వారందరితో రాహుల్ చర్చలు జరపనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ గట్టెక్కాల్సిన పరిస్థితి ఉంది. దీంతో తెలంగాణను కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్‌గా తీసుకుంది. ఇందులో భాగంగానే ప్రియాంకను తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్‌గా పంపించనున్నారనే చర్చ జరుగుతోంది. ఇటీవలే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంకకు తూర్పు యూపీ బాధ్యతలు ఇచ్చారు. అదనంగా తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు కూడా ఇవ్వనున్నారనేది స్పష్టంగా కనిపిస్తోంది.ఉత్తర భారతంలో ఇటీవల కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. దక్షిణ భారతంలోనూ కాంగ్రెస్ హైప్ పెరగాలంటే కచ్చితంగా తెలంగాణ అనేది అత్యంత కీలకమైన రాష్ట్రంగా కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. అందుకే ప్రియాంకను తెలంగాణకు పంపిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌గా కుంతియా ఉన్నారు. అయితే ఆయన పార్టీని సరిగ్గా డీల్ చేయలేకపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అందరిని ఒకతాటిపైకి తీసుకురాలేకపోయారని కుంతియాపై విమర్శలు ఉన్నాయి. కుంతియాను తప్పించాలని హైకమాండ్‌పై ఒత్తిడి తెస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన పొరపాట్లు పార్లమెంటు ఎన్నికల్లో రిపీట్ కాకుండా ఉండేందుకు కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించింది. దీనిలో భాగంగానే ప్రియాంకను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్‌గా నియమిస్తారని స్పష్టంగా తెలుస్తోంది

Related Posts