YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి శిల్పా

మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి శిల్పా
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
 నంద్యాల ఉప ఎన్నికలో ఘోర ఓటమిని జీర్ణించుకోలేని శిల్పామోహన్ రెడ్డి తాను ఇక రాజకీయాల్లో కొనసాగలేనని కుటుంబ సభ్యులకూ తెలిపారు. దీంతో ఆయన కుమారుడు శిల్పా రవి రెడ్డి పార్టీ బాధ్యతలను నంద్యాల నియోజకవర్గంలో భుజానకెత్తుకున్నారు. సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డి శ్రీశైలం నియోజకవర్గంలోని పార్టీ పటిష్టతపై బిజీగా ఉన్నారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని కూడా శిల్పా మోహన్ రెడ్డి వైసీపీ అధినేత జగన్ కు చెప్పారు. జగన్ పాదయాత్ర కర్నూలు జిల్లాలో జరిగే సమయంలోనూ శిల్పా మోహన్ రెడ్డి ఇంటిపట్టునే ఉన్నారు. చిన్నవయస్సున్న భూమా బ్రహ్మానందరెడ్డిపై ఓటమితో ఆయన మానసికంగా కుంగిపోయారు. నంద్యాల ఓటర్లు తనను నమ్మించి మోసం చేశారని ఒక దశలో ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు కూడా. తాను ఓటమిపాలయితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కూడా నంద్యాల ఉప ఎన్నికలకు ముందు శిల్పా సవాల్ విసిరారు. దానికి అనుగుణంగానే ఆయన రాజీకీయ సన్యాసం స్వీకరించి తన కుమారుడు శిల్పా రవిరెడ్డిని వచ్చే ఎన్నికల్లో పోటీకి దింపాలని నిర్ణయించారు. దీంతో శిల్పా రవి రెడ్డి కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండటం, కార్యకర్తలతో మమేకమవుతుండటంతో వచ్చే ఎన్నికల్లో నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి రెడ్డి అనుకున్నారంతా.తెలుగుదేశం పార్టీలో ఈక్వేషన్లు మారుతున్నాయి. భూమా బ్రహ్మానందరెడ్డికి ఈసారి టిక్కెట్ టీడీపీ ఇవ్వడం కష్టమేనన్న వార్తలు వస్తున్నాయి. నంద్యాల పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డి తన అల్లుడు శ్రీధర్ రెడ్డికి నంద్యాల అసెంబ్లీ టిక్కెట్ తెచ్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. తనకు నంద్యాల పార్లమెంటు స్థానాన్ని, తన అల్లుడు శ్రీధర్ రెడ్డికి నంద్యాల అసెంబ్లీ స్థానాన్ని ఇవ్వాలని ఇప్పటికే టీడీపీ అధినాయకత్వానికి రిక్వెస్ట్ పంపారు. భూమా ఫ్యామిలీ క్రమంగా పట్టుకోల్పోతుండటంతో నంద్యాల సీటును ఈసారి భూమా ఫ్యామిలీకి కాకుండా ఇతరులకు ఇవ్వాలన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. సర్వేలు కూడా భూమా బ్రహ్మానందరెడ్డికి వ్యతిరేకంగా వస్తుండటంతో అభ్యర్థిని మారుస్తారన్న టాక్ పార్టీలో బలంగా ఉంది.శిల్పా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నట్లుంది. భూమా ఫ్యామిలీ కాకుండా ఎస్పీవై రెడ్డి కుటుంబం కానీ, ఇతరులెవరైనా తన గెలుపు సులువవుతుందని శిల్పా మోహన్ రెడ్డి భావిస్తున్నారు. వరుస ఎన్నికల్లో ఓటమితో తనకు సానుభూతి పెరిగిందని ఆయన అంచనా వేస్తున్నారు. అందుకే గత కొద్దిరోజులుగా శిల్పా మోహన్ రెడ్డి యాక్టివ్ అయ్యారు.కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. వార్డు స్థాయినేతలను కూడా పార్టీలో చేర్చుకుంటున్నారు. దీంతో మరోసారి శిల్పా మోహన్ రెడ్డి నంద్యాల నుంచి పోటీ చేసే అవకాశముందని తెలుస్తుంది. రాజకీయాల నుంచి వైదొలుగుతానని చెప్పిన ఆయన తన మనసు మార్చుకున్నట్లుంది

Related Posts