YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విశాఖ వైసీపీ అభ్యర్ధిగా పురందరేశ్వరీ??

 విశాఖ వైసీపీ అభ్యర్ధిగా పురందరేశ్వరీ??

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

వైసీపీ జోరు పెంచింది. విశాఖ సహా ఉత్తరాంధ్రలోని జిల్లాలకు ఎంపీ అభ్యర్ధులను ఎంపిక చేసే పనిలో ఆ పార్టీ ఇపుడు బిజీగా ఉంది. ప్రతిష్టాత్మకమైన విశాఖ ఎంపీ సీటుకు కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి పేరును ప్రతిపాదిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో విశాఖ జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కనున్నాయి. గత ఎన్నికల్లో తన తల్లి విజయమ్మను నిలబెట్టినా ఓటమి ఎదురై కోల్పోయిన విశాఖ సీటును ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ దక్కించుకోవాలని వైసీపీ గట్టి పట్టుదలతో ఉంది. అందువల్ల బలమైన అభ్యర్ధిగా పురంధేశ్వరి పేరుని ఆ పార్టీ పరిశిలిస్తోందని భోగట్టా..పురంధ్వేశ్వరి అయితే అన్ని రకాలుగానూ కలసి వస్తుందని ఆ పార్టీ అంచనా వేస్తోంది. నిజానికి విశాఖ ఎంపీ టికెట్ ని ప్రముఖ రియల్టర్ గా ఉన్న ఎంవీవీ సత్యనారాయణకు ఇస్తారని ప్రచారంలో ఉంది. ఆయన సైతం అదే విధంగా జనంలోకి వస్తూ ఎన్నికల కోసం అంతా సిధ్ధం చేసుకుంటున్నారు. అయితే ఆయన విశాఖ జనాలకు పెద్దగా పరిచయం లేకపోవడంతో పాటు స్థానికేతరుడన్న విమర్శలు కూడా ఉన్నాయి. దాంతో పాటు ఆయన అభర్ధిత్వం తో ముందుకు సాగితే గెలుపు అవకాశాలు తక్కువగా ఉంటాయని కూడా పార్టీ సర్వేలు తేల్చాయట. ఈ నేపధ్యంలో తెర మీదకు పురంధేశ్వరి పేరుని తీసుకు వస్తున్నారు. ఆమె గతంలో విశాఖ నుంచి ఎంపీగా గెలిచిన చరిత్రను కలిగి ఉన్నారు. అంతే కాదు ఇక్కడ నుంచి నెగ్గి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. దానికి తోడు అన్న గారి కుటుంబం నుంచి రావడం కూడా ప్లస్ అవుతుందని, టీడీపీ ఓట్లను కూడా చీల్చవచ్చునని వైసెపీ అంచనాలు వేసుకుంటోంది.విశాఖ సహా ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పురంధేశ్వరి పేరుని పరిశీలించడమే కాకుండా అధినేత జగన్ కి కూడా ఆమె పేరు సిఫార్సు చేశారని తెలుస్తోంది. తొందరలోనే దగ్గుబాటి కుటుంబం వైసీపీలో చేరనున్న క్రమంలో పురంధేశ్వరిని విశాఖ బరిలో నిలబెడితే ఆమె గెలుపు సులువు అవుతుందని, అంతే కాకుండా ఆ ప్రభావం అసెంబ్లీ అభ్య‌ర్ధుల మీద కూడా పడి పార్టీకి మంచి వూపు వస్తుందని పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. మరో వైపు బీజేపీ కూడా ఆమెను విశాఖ నుంచే ఎంపీగా పోటీ చేయించాలనుకుంటోంది. మరి పురంధేశ్వరి ఏ విధంగా ఆలోచిస్తారు, ఆమె వైసీపీలో చేరిపోతారా అన్న దానిపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. వైసీపీ తరఫున కనుక పురంధేశ్వరి రంగంలో ఉంటే విశాఖలో టీడీపీకి గడ్డు పరిస్థితి తప్పదని కూడా అంటున్నారు. 

Related Posts