YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబు... ప్రారంభించేశారు... ఎమ్మెల్యేల పనితీరుపై పోస్టుమార్టం

 చంద్రబాబు... ప్రారంభించేశారు... ఎమ్మెల్యేల పనితీరుపై పోస్టుమార్టం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

సెంబ్లి ఎన్ని కల ముందు టీడీపీలో కీలక పరిణా మానికి తెరలేచింది. తమ పార్టీ మం త్రులు, ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖాముఖి భేటీలను నిర్వహి స్తున్నారు. వారి జాతకాలను వారి చేతిలోనే పెట్టి నియో జకవర్గాల్లో వారి బలాలు, బలహీనతలను చెప్పి ఎలా దిద్దుకోవాలో, ఏవి సరిచేసు కోవాలో వివరిస్తున్నారు. పరిస్థితి బాగోలేని వారికి మొహమాటం లేకుండా అక్షింతలు వేస్తున్నారు. ఈ భేటీలను బుధవారం నుండే ఆయన ప్రారం భించారు. రోజుకు 15 నుండి 20 మంది వరకూ పిలిపించుకుని మాట్లాడు తున్నారు. మొదటి రోజు మాట్లాడిన వారిలో మంత్రి శిద్ధా రాఘవరావు వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. అన్ని ప్రాంతాలు, అన్ని సామాజి కవర్గాలను కలిపి ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. బలంగా ఉన్న ఎమ్మెల్యేలు, బలహీనంగా ఉన్న ఎమ్మెల్యేలను కలిపి పిలవడం ద్వారా ఎవరికీ ఏ సంకేతాలు అందకుండా జాగ్రత్త పడుతున్నారు.ప్రజల్లో, పార్టీ శ్రేణుల్లో వారిపై ఉన్న అభిప్రాయం, ప్రజలు, పార్టీ వారితో సం బంధాలు, బలాలు, బలహీనతలపై ఈ సమాచారం సేకరిస్తున్నారు. వాటిని నివేదిక రూపంలో తయా రుచేసి ఇప్పుడు వారి చేతికి ఇస్తున్నారు. ఎమ్మెల్యేలకు గతంలో కూడా కొన్ని నివేదికలు ఇచ్చారు. అప్పుడవి సంక్షిప్తంగా ఉండేవి. సరిదిద్దుకోవాల్సిన అంశాలు దూరంగా ఉన్న పార్టీ నేతలు, వివిధ అంశాల్లో వారికి వచ్చిన మార్కులతో ఉండేవి. ఈ సమాచారాన్ని ఇప్పుడు మరికొంత విపులంగా ఎమ్మెల్యేల చేతికి ఇవ్వబోతున్నానని సోమవారం జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు చెప్పిన సంగతి పాఠక విధితమే. ఈనేపథ్యంలోనే ఆయన ఆ కార్యక్రమాన్ని కార్యరూపంలోకి తీసు కొచ్చారు. అయితే, అన్నీ చెబితే సమాచారం ఇచ్చిన వారిపై దండెత్తుతారని గతంలో కొన్ని చెప్పలేదు. కానీ, ఇప్పుడు సమయం వచ్చినందున నిర్మొహమాటంగా ఎమ్మెల్యేలు, మంత్రుల చిట్టా విప్పుతున్నారు.మీ లోపాలు, సమస్యలు ఏమిటో అన్నీ చెప్పదలిచాను. కొందరు బాగా చేసుకుం టున్నారు, కొందరు బాగా పనిచేస్తున్నా సరైన సంబంధాలు నిర్వహించ లేకపోతు న్నారంటూ ముఖ్యమంత్రి వారికి చెబుతు న్నారు. మరి కొందరు వివాదాల్లో చిక్కుకుంటున్నారని, ప్రజల్లో మంచిపేరు ఉండటం మీకు, నాకు అవసరం, అందుకే మీ లోపాలు ఏమిటో మీ చేతికే ఇస్తాను. దిద్దు కుంటే మంచిది. లేకపోతే నష్టపో తారని ఈ సందర్భంగా వారికి ముఖ్యమంత్రి నిష్కర్షగా చెప్పేస్తు న్నారు. ఈ భేటీలో పాల్గొన్న ఎమ్మెల్యేలు బయటకు వచ్చాక పైకి గంభీరంగానే కనిపిస్తున్నారు. ఆయన చెప్పిన లోపాలు నిజమే అని మాకు తెలుసు, వాటిని సరిచే సుకునే ప్రయత్నంలో ఉన్నాంమని చెప్పారు. శాసనసభ్యుల పనితీరుపై ప్రతి నియోజక వర్గంలోనూ ప్రతి నెలా 25 వేల మంది నుండి వివిధ మార్గాల్లో అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్ని సంక్షేమ కార్యకమాలు చేసినా, శాసన సభ్యులు నియోజకవర్గంలో అందుబాటులో లేకపోతే ప్రజలు ఆమోదించడం లేదన్న విషయాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సిట్టింగులకు హితబోధ చేస్తున్నట్లు తెలిసింది

Related Posts