యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ విభాగ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రథయాత్రకు సిద్దమయ్యారు. తొలివిడత మొత్తం 15 నుండి 20 రోజులు ఈ రథయాత్ర రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 80 నుంఛి వంద వియోజకవర్గాల్లో ఈ రధయాత్ర సాగుతుంది. ఉత్తరాంధ్రాలోని పలాస నుండి ఫిబ్రవరి 4వ తేదీన ప్రారంభమయ్యే రథయాత్రను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రారంభించనున్నారు. యాత్రలో పాల్గొనే వారికి అల్పాహారం, భోజనం, రాత్రి బస తదితరాలు బీజేపీ కార్యకర్తల ఇళ్ల వద్దే ఏర్పాటుచేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర సామాజికవర్గాలు ఉన్న ప్రాంతాల మీదుగా రథయాత్రకు ప్రాధాన్యమిస్తారు. 4న పలాస, టెక్కలి, శ్రీకాకుళం, 5న ఎచ్చర్ల, రాజా, పాలకొండ, కురుపాం, పార్వతీపురం, బొబ్బిలి, 6న గణపతినగరం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, 7న చోడవరం, యలమంచిలి, పాయకరావుపేట, తుని, అన్నవరం మీదుగా యాత్ర సాగనుంది. 8న గొల్లప్రోలు, పిఠాపురం, కాకినాడ, రామచంద్రాపురం, అమలాపురం, రావులపాలెం, రాజమండ్రి, 9న కొవ్వూరు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, భీమవరం, ఉండి, గణపవరం, ఏలూరు మీదుగా యాత్ర సాగుతుంది. 10వ తేదీన హనుమాన్ జంక్షన్, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు, పెనుమలూరు, విజయవాడ, 11న మంగళగిరి, తెనాలి, పొన్నూరు, గుంటూరు, నర్సరావుపేట, వినుకొండ, 12న అద్దంకి, దర్శ, ఒదిలి, ఒంగోలు, కందుకూరు, కావలి, 13న నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, శ్రీకాళహస్తి, తిరుపతి, 14న పుత్తూరు, జీడి నెల్లూరు, చిత్తూరు, పలమనేరు, పుంగనూరు, మదనపల్లి, 15న మొలకలచెరువు, తనకల్లు, కదిరి, ఒడీసీ, గోరంట్ల, హిందూపురం మీదుగా యాత్ర సాగుతుంది. 16న పెనుగొండ, ధర్మవరం, అనంతపురం, శింగనమల, తాడిపత్రి, 17న పులివెందుల, వేంపల్లి, రాయచోటి, రాజంపేట, కడప, 18న మైదుకూరు, ప్రొద్దుటూరు, నంధ్యాల, కర్నూలు, కోడమూరు, ఆలూరు, ఎమ్మిగనూరు మీదుగా ఆదోని చేరుకున్న అనంతరం యాత్ర ముగుస్తోంది. రధయాత్రలో కన్నా లక్ష్మీనారాయణతో పాటు జాతీయ స్థాయి నేతలు, కేంద్ర మంత్రులు కూడా పాల్గొని, ప్రసంగాలుచేస్తారు.