YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పరీక్షలే జీవితం కాదు

పరీక్షలే జీవితం కాదు
 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
మంగళవారం నాడు జరిగిన  పరీక్షా పే చర్చా కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఢిల్లీ తాల్కటోరా స్టేడియంలో రెండు వేలమంది విద్యార్ధులు, టీచర్లతో జరిగిన ఈ కార్యక్రమంలో 24 రాష్ట్రాల, విదేశాలలో చదువుతున్న విద్యార్దులు టెలికాన్ఫరెన్స్ ద్వారా ప్రధానితో మాట్లాడారు. ప్రధాని మాట్లాడుతూ పరీక్షల సమయంలో ఒత్తిడికి గురికావొద్దని, పరీక్షలే జీవితం కాదని విద్యార్థులకు సూచించారు.  తల్లిదండ్రులు వారి కలల్ని పిల్లలు నెరవేర్చాలని అనుకోవద్దని తెలిపారు.  పరీక్షలు ముఖ్యమైనవి కానీ.. అవి మన జీవితానికే పరీక్షలు కావని, అవి జీవితాలను ఆపవని అన్నారు. పరీక్షల్లో ఒత్తిడిని అధిగమించేందుకు మెలకువలను చెప్పిన మోదీ, క్రమానుగుణంగా పాఠ్యాంశాలను చదవడం ద్వారా చాలా సులువుగా ఉత్తీర్ణతను సాధించవచ్చని అన్నారు. తల్లిదండ్రులు వారి కలల్ని పిల్లలపై రుద్దొద్దని సూచించారు. తమ కలలు పిల్లలు నెరవేర్చాలని అనుకోవడంతో చిన్నారులపై భారం పెరుగుతుందని, అలా చేయకూడదని చెప్పారు. పిల్లలు విఫలమైనప్పుడు కూడా తల్లిదండ్రులు చిన్నారుల వెన్ను తట్టి ప్రోత్సహించాలని తెలిపారు. తమ పిల్లలు ఆన్లైన్ గేమ్స్పై చాలా ఆసక్తి చూపుతున్నారని, దీన్ని ఎలా పరిష్కరించాలని కొందరు అడుగుతున్నారు.  అయితే సాంకేతిక వల్ల లాభాలూ ఉన్నా నష్టాలు కూడా ఉన్నాయని తెలిపారు. తల్లిదండ్రులు దగ్గరుండి సాంకేతికత  సాయంతో కొత్త విషయాలు నేర్చుకునేలా ప్రోత్సహించాలని తెలిపారు. మీరు లక్ష్యాన్ని చేరుకోలేకపోయినా క్షమార్హం.. కానీ మీ లక్ష్యం చిన్నదైతే మాత్రం అది క్షమార్హం కాదని మోదీ వెల్లడించారు. మీరు రోజుకు 17 గంటలు పనిచేయడానికి ఏం అంశం మిమ్మల్ని ప్రోత్సహిస్తోందని ఓ విద్యార్థిని మోదీని ప్రశ్నించగా.. ఓ తల్లి కుటుంబం కోసం 24 గంటలు శ్రమించినట్లుగానే, నేను నా 1.25కోట్ల భారతీయ కుటుంబం కోసం శ్రమిస్తున్నానని సమాధానమిచ్చారు.  రోజులోని 24 గంటలు ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలని మోదీ విద్యార్థులకు సూచించారు.  

Related Posts