యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ ముద్రించిన ‘కలసి కట్టుగా కృషి చేద్దాం.. స్వర్ణాంద్రప్రదేశ్ ను సాదిద్దాం’ అనే ప్లెక్సీ వాల్ హ్యాంగింగ్ కాలెండర్లను మంగళవారం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ తన క్యాంప్ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ క్యాలండర్ లను ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయలు, గ్రామ పంచాయితీలు, చౌక దుకాణాలు ప్రభుత్వ ఆసుపత్రలు, గ్రంధాలయాలు, వెలుగు మహిళ సమాఖ్య సంఘాలతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయలకు పంపిణి చేయలని జిల్లా సమాచార శాఖ అధికారులను కలెక్టర్ అదేశించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ప్రశాంతి, సిపిఓ ఆనందనాయక్, డ్వామా పిడి వెంకట సుబ్బయ్య సమాచార పౌరసంబంధాల శాఖ అధికారి సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.