YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబును నమ్మోద్దు

చంద్రబాబును నమ్మోద్దు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఎన్నికలకు ముందు అనేక మోసపూరిత వేషాలు వేస్తున్న చంద్రబాబును నమ్మద్దు. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు అనేక వేషాలు వేసి వాగ్దానాలు చేసి వాటిని అమలు చేయలేక మోసం చేశారని వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు. అధికారం ఇచ్చిన ప్రజలకు తాము ఈ పనులు చేశాం కాబట్టి మాకు ఓట్లేయండి అని చంద్రబాబు అడగాలి. అలాంటిది మళ్లీ తాను అదికారంలోకి వస్తే ఇది చేస్తాను,అది చేస్తాను అని చంద్రబాబు అధికారంలో ఉండి చెప్పడం ఏంటని అయన ప్రశ్నించారు. ఢిల్లీలో ప్రత్యేకహోదా ,విభజన హామీలకోసం చంద్రబాబు దీక్ష చేస్తానంటున్నారు. మరి నాలుగున్నరేళ్లు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేశారు. ప్రజల్ని మోసం చేయడం కోసం దొంగదీక్షలు చేశారు. కాపు రిజర్వేషన్లపై చట్టబధ్దత తీసుకువస్తానికి ప్రయత్నిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. కేంద్రం నిర్ణయం తీసుకుని ఓసిలలో ఆర్దికంగా వెనకబడిన వారికిి 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనుకున్నారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో సోషల్ బ్యాక్ వర్డ్ నెస్ కాకుండా ఉన్నవారికి ఆర్తికంగా వెనకబడి ఉన్నవారికి అవి ఇచ్చారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి అభ్యంతరం లేదు. కేంద్రం ఇచ్చిన దానిలో ఐదుశాతం కాపులుకు ఇస్తానికి చట్టబద్దత తెస్తానడం మోసం చేయడమే.చట్టాలను వక్రీకరించడమనని అయన అన్నారు. సామాజికంగా వెనకబడిన వారికి అవి వర్తించవు. అసెంబ్లీలో తీర్మానం చేసి ఎన్నికలకు ముందు మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది మోసం ,దగా దీనిని కాపు సోదరులు గమనించాలి. చంద్రబాబు నాయుడు డ్వాక్రామహిళలకు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తామంటున్నారు. అప్పుగా ఇచ్చి డ్వాక్రామహిళలను మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాక వాటిని ఇచ్చే పరిస్దితి ఉండదు.  జగన్  డ్వాక్రామహిళలకు బాకీ ఉంటే ఆ మొత్తాన్ని మీ చేతికే ఇస్తామని చెప్పారు. చంద్రబాబునాయుడులా మహిళలను మోసం చేయడానికి సిధ్దంగా లేమని అన్నారు. ఈ డ్రామాలను డ్వాక్రామహిళలు గమనించాలని కోరుతున్నాం. చంద్రబాబునాయుడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేస్తామంటున్నారు. ప్రత్యేక హోదా కోసం అనిచెబుతున్నారు.హోదా కంటే ప్యాకేజి అద్బుతంగా ఉంటుందని మీరే చెప్పారు కదా. అలాంటి మీరే అఖిలపక్షం ఏర్పాటుచేస్తున్నారు కాబట్టే మేం హాజరుకామని చెబుతున్నాం. ప్యాకేజి ఇచ్చిన అరుణ్ జైట్లీకి సన్మానాాలు చేసి అసెంబ్లీలో తీర్మానం చేసింది మీరే కదా. ఇలాంటి డ్రామాలకు హాజరుకాము అని చెబుతున్నాం. హోదా కోసం ధర్నాలకు హాజరైతే జైళ్లకు పంపుతామని చంద్రబాబు అన్నమాట మరిచిపోలేదు. ఈ రోజుకు ప్రత్యేకహోదా నినాదం జీవించి ఉందంటే దానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ,  వైయస్ జగన్ ప్రధాన కారణమని అన్నారు. మాజి పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసారు. దానికి ప్రధాన కారణం హోదా నినాదాన్ని చంపేసిన టిడిపి,వారు అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన జనసేన. ఈ సమావేశానికి హాజరవుతున్నారు కాబట్టి మేము హాజరుకావడంలేదు. –ఉండవల్లి కి మేం వ్యతిరేకం కాదు. మేం ఏది చెప్పామో అదిచేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నామని స్పష్టం చేస్తున్నా. చంద్రబాబు ఎన్నికలు రాగానే విచిత్రమైన ప్రయత్నాలు చేస్తుంటారు.తటస్దున్ని తీసుకువచ్చి చంద్రబాబు అద్బుతంగా పనిచేశారు అని చెప్పిస్తారు. లగడపాటి రాజగోపాల్ ,ఓ పత్రికాఛానల్ అధిపతి కలసి చంద్రబాబుతో చర్చలు చేసి కుట్రకు తెరతీశారు. ప్రతిపక్షపార్టీ అధికారంలోకి రాకుండా చేయాలి. తెలంగాణాలో ప్రజలనాడిని పసిగట్టే సర్వేలు వెల్లడించారే అక్కడేం జరిగింది. అదే విధంగా ఏదో ఒకటి చేసి తిరిగి చంద్రబాబునాయుడు గెలిచిపోతున్నారేమో అనే భ్రమలు ప్రజలలో కలిగేలా  అభూత కల్పనలు చేసేందుకు రంగం సిధ్దం చేస్తున్నారు. మీరు ముగ్గురు కలసి చర్చించుకోవచ్చు కుట్రలు చేయచ్చు. ముద్రగడ పద్మనాభం  కత్తిపూడిలో కాపునాయకుల్ని కలిసి చర్చించుకునేందుకు మాత్రం వీల్లేదని అయన అన్నారు.అంటే మీరు మాత్రం కలసి చర్చించుకోవచ్చు.కుట్రలు చేయవచ్చు.ముద్రగడ మాత్రం సాధారణంగా చర్చించుకునేందుకు మాత్రం అనుమతి ఇవ్వరని విమర్శించారు.

Related Posts