YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కియా కారును టెస్ట్ డ్రైవ్ చేసిన చంద్రబాబు

కియా కారును టెస్ట్ డ్రైవ్ చేసిన చంద్రబాబు

 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కియా కారు మంగళవారం విడుదల అయింది. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం, యర్రమంచిలో ముఖ్యమంత్రి చంద్రబాబు కియా కారును ఆవిష్కరించారు. అనంతరం టెస్ట్ డ్రైవ్ చేశారు. ఆయనతోపాటు కంపెనీ ప్రతినిధులు కూడా కారు టెస్ట్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కియా, హుండయ్ అనుబంధంతో కియా కార్ల తయారీ పరిశ్రమలో కియాతోపాటు హుండయ్ అనుబంధంగా కార్లు తయారయ్యేలా ఏర్పాట్లు చేశారు. అందులో కియా పరిశ్రమకు చెందిన బాడీషాప్, పార్ట్స్, ప్రెస్, అసెంబ్లీ, ఇంజిన్ షాప్, కాయిల్ సెంటర్ అనే ఆరు విభాగాలు పనులకు సిద్ధంగా ఉన్నాయి. అదే తరహాలో హుండయ్ కంపెనీ కూడా ఆరు విభాగాలను సిద్ధం చేసింది. హుండయ్ మోబి స్, హుండయ్ డైమోస్, హుండయ్ గ్లోవిస్, హుండయ్ గ్లోవిస్ యుపీసీ, హుండయ్ డైమోస్ సీట్, హుండయ్ స్టీల్ అనే విభాగాలు కార్ల తయారీకోసం సిద్ధంగా ఉన్నాయి. కియా పరిశ్రమలో గంటకు 34 కార్లు తయారవుతాయని నిపుణులు చెబుతున్నారు. సంవత్సరానికి 3 లక్షల కార్లు తయారవుతాయి. ఇక్కడి నుంచి ప్రపంచంలోని అన్ని దేశాలకు ఎగుమతి చేసేలా రైల్వే ట్రాక్ను కూడా సిద్ధం చేశారు. 
జిల్లాలో నిర్మించిన కియా కార్ల పరిశ్రమతోపాటు అనుబంధ పరిశ్రమలకు సుమారు రూ.20 వేల కోట్లు ఖర్చు చేశారు. అందులో రూ. 13,500 కోట్లతో కియా మెయిన్ ప్లాంట్ రూపుదిద్దుకుంది. అందులో 11 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. కియా అనుబంధ పరిశ్రమలు రూ. 6900 కోట్లు పెట్టుబడితో పలు ప్లాంట్లను నిర్మించాయి. 

Related Posts