YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

50 కోట్ల క్లబ్ లో మణికర్ణిక

50 కోట్ల క్లబ్ లో మణికర్ణిక

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో: 

కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషించి, సహ దర్శకురాలిగా వ్యవహరించిన ‘మణికర్ణిక’ సినిమాపై మిశ్రమ స్పందన వచ్చినా బాక్సాఫీసు వద్ద మాత్రం దూసుకుపోతోంది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న మొత్తం మూడు భాషల్లో  విడుదలైన ఈ చిత్రం నాలుగు రోజుల్లో రూ.47.65 కోట్లు వసూలు చేసింది. తొలి మూడు రోజులతో పోలిస్తే సోమవారం కలెక్షన్లు బాగా తగ్గిపోయాయి. అయినప్పటికీ నాలుగు రోజుల్లో మంచి వసూళ్లనే రాబట్టింది. తొలిరోజు శుక్రవారం ‘మణికర్ణిక’ ప్రపంచ వ్యాప్తంగా రూ.8.75 కోట్లు వసూలు చేసింది. రెండో రోజు శనివారం సెలవు దినం కావడంతో ‘మణికర్ణిక’కు బాగా కలిసొచ్చింది. శనివారం ఈ చిత్రం ఏకంగా రూ.18.1 కోట్లు రాబట్టింది. మూడో రోజు ఆదివారం రూ. 15.70 కోట్లు వసూలు చేసింది. అయితే నాలుగో రోజు సోమవారం కలెక్షన్లు బాగా తగ్గిపోయాయి. కేవలం రూ.5.10 కోట్లు మాత్రమే వసూలైంది. మొత్తంగా చూసుకుంటే నాలుగు రోజుల్లో ‘మణికర్ణిక’ రూ.47.65 కోట్లు వసూలు చేసి భళా అనిపించింది. మణికర్ణిక’ కలెక్షన్లకు సంబంధించిన వివరాలను బాలీవుడ్ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్, అతుల్ మోహన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘మణికర్ణిక’కు పోటీగా వచ్చిన బాల్ థాకరే బయోపిక్ ‘థాకరే’ బాక్సాఫీసు వద్ద డీలా పడింది. నవాజుద్దీన్ సిద్ధిఖి టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రం నాలుగు రోజుల్లో కేవలం రూ.20 కోట్ల మార్కును మాత్రమే దాటగలిగింది. ‘మణికర్ణిక’ మూడు భాషల్లో విడుదలవడం కలిసొచ్చింది. 

Related Posts