యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 1న హస్తినబాటపట్టనున్నారు. ఈ టూర్లో బీజేపీయేతర కూటమి చేసే పోరాటాలపై జాతీయ స్థాయి నేతలతో చర్చించబోతున్నారు. కోల్కతా తరహా సభలను నిర్వహించాలని భావిస్తున్న చంద్రబాబు.. తన ఆలోచనను జాతీయ నేతల దగ్గర ప్రస్తావించాలనుకుంటున్నారు. అలాగే అమరావతిలో కూడా సభ ఏర్పాటు చేయాలనుకుంటున్న టీడీపీ అధినేత.. ఈ అంశంపై కూడా నేతలతో చర్చిస్తారట. ఈవీఎంల పనితీరుపై జాతీయ నేతలతో చంద్రబాబు మంతనాలు జరపనున్నారు. ఈవీఎంలు వద్దంటూ ఫిబ్రవరి 1న ఎన్నికల సంఘంతో పాటూ రాష్ట్రపతిని కలవాలని భావినిస్తున్నారట. ఈ అంశంపై కూడా టీడీపీ అధినేత చర్చిస్తారట. అంతేకాదు చంద్రబాబు ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం ఢిల్లీలో దీక్ష చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ విషయాన్ని జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్లబోతున్నారట