యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
విజయవాడలోని కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ఇళ్ల పట్టాలిచ్చిన తర్వాతే టీడీపీలో చేరుతానని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా టీడీపీ నాయకత్వానికి చెప్పినట్టు సమాచారం. ఈ కారణంగానే రాధా టీడీపీలో చేరిక ఆలస్యమైందనే ప్రచారం ఆ పార్టీ వర్గాల్లో సాగుతోంది. వాస్తవానికి ఈ నెల 26వ తేదీనే రాధా టీడీపీలో చేరాల్సి ఉంది. ఇళ్ల పట్టాల సమస్య కారణంగానే రాధా చేరిక ఆలస్యమైందని చెబుతున్నారు.విజయవాడలోని కొండ ప్రాంతంలో నివాసం ఉంటున్నవారికి పట్టాలు పంపిణీ చేయాలని తన వద్దకు రాయబారానికి వచ్చిన టీడీపీ ప్రతినిధులతో రాధా చెప్పారని సమాచారం. అయితే ఇళ్ల పట్టాల పంపిణీకి తాము సిద్దమేననే విషయాన్ని టీడీపీ నేతలు రాధాకు హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. రాధాకు ఎమ్మెల్సీ పదవిని కూడ ఇవ్వనున్నట్టు కూడ టీడీపీ నేతలు రాధాకు చెప్పారంటున్నారు.అయితే ఈ నెల 26వ తేదీన టీడీపీలో చేరేందుకు రాధా ముహుర్తాన్ని నిర్ణయించుకొన్నారని సమాచారం.అయితే ఇళ్ల పట్టాలను ఇచ్చిన తర్వాతే పార్టీలో చేరుతానని రాధా టీడీపీ నాయకత్వానికి తేల్చి చెప్పినట్టు సమాచారం. దరిమిలా రాధా చేరిక ఆలస్యమైందనే ప్రచారం కూడ లేకపోలేదు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా టీడీపీలో చేరేందుకు ఆలస్యం కావడానికి కారణంగా చెబుతున్నారు. విజయవాడ సెంట్రల్ సీటులో రాధాకు బదులుగా మల్లాది విష్ణుకు టిక్కెట్టు ఇస్తామని స్పష్టం చేసింది. సెంట్రల్ సీటు నుండే పోటీ చేస్తానని రాధా స్పష్టం చేశారు. మచిలీపట్నం ఎంపీ స్థానం లేదా ఆవనిగడ్డ నుండి పోటీ చేయాలని రాధాకు వైసీపీ నాయకత్వం కోరింది. కానీ, సెంట్రల్ సీటును వదులుకొనేందుకు రాధా సిద్దంగా లేడు. చివరకు వైసీపీ కీలక నేతలు రాధాతో సంప్రదింపులు జరిపినా కూడ రాధా తగ్గలేదు. వైసీపీకి రాజీనామా చేశారు.