యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తమిళనాడులో ప్రముఖ శరవణ స్టోర్లు, జీ స్క్వేర్, లోటస్ సంస్థల కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులను మొత్తం 74 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేపట్టింది. వీటిల్లో మొత్తం 72 ప్రాంతాలు ఒక్క చెన్నైలోనే ఉన్నాయి. కోయంబత్తూర్‌లోని మరో రెండు ప్రదేశాల్లో దాడులు చేపట్టింది. వీటిల్లో జీ స్క్వేర్ కంపెనీ నాన్ గవర్నమెంట్ కంపెనీగా ఆర్‌వోసీ వద్ద నమోదైంది. లోటస్ వెంచర్స్ కూడా ప్రవేటు సంస్థగా నమోదైంది. వీటి షేర్ క్యాపిటల్ రూ.1,00,000గా పేర్కొన్నారు. ఈ రెండు కంపెనీలకు క్రిష్ణన్, శ్రీజిత్, రంగస్వామి రామజయం, శ్రీకళాలు డైరెక్టర్లుగా ఉన్నారు. దీనికి తోడు శరవణ స్టోర్ల కార్యాలయాలపై కూడా దాడులు కొనసాగుతున్నాయి. శరవణ యజమాని యోగిరత్నం పాండురైను కూడా అధికారులు అదుపులోకి తీసుకొన్నారు.ఈ ఉదయం నుంచి 150 మందికి పైగా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదాయపన్ను శాఖ సమర్పించిన పత్రాల్లో చూపించిన లెక్కలకు పొంతన కుదరడం లేదనే ఆరోపణలపై సోదాలు కొనసాగుతున్నాయి.