YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అవినీతితో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్

అవినీతితో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్

 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్‌లో అవినీతి కంపు కొడుతోంది. అందులో ప్రధానంగా ప్రజారోగ్య, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ వంటి విభాగాల్లో అధికారులు ఎక్కువగా అవినీతికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యాలయంలో ప్రతి పనికీ ఒక ధర నిర్ణయించి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వారు అడిగినంత ముట్టజెబితే చాలు అడ్డగోలు వ్యవహారమైనా సాఫీగా సాగిపోతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్‌కు గత కొనే్నళ్లుగా పాలకవర్గం లేదు.  అప్పటి నుంచి పాలకవర్గం లేకపోవడంతో అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాల్లో మామూళ్లు ఇవ్వనిదే పనులు కావడం లేదన్న ఆరోపణలు లేకపోలేదు. రెవెన్యూ విభాగంలో ఇంటి పన్ను, వాణిజ్య భవనాలకు పన్ను వేయాలంటే రూ. 50వేల దాకా లంచం ఇవ్వనిదే పని చేయడం లేదన్న ఆరోపణలు వినిపిన్తున్నాయి. ఇక టౌన్ ప్లానింగ్ విభాగంలో ఇళ్లు, అపార్టుమెంట్లు, కమర్షియల్ భవనాల అనుమతులకు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నట్లు సమాచారం. అపార్టుమెంట్లకు అయితే ఒక్కో ఫ్లోర్‌కు రూ. 20వేల చొప్పున ఎన్ని ప్లోర్లు కడితే అంత మొత్తం వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి పనిలో వర్క్ ఇన్‌స్పెక్టర్ల నుంచి ఉన్నతస్థాయి అధికారి వరకూ ఇలా ప్రతి చోటా మామూళ్ల జాడ్యం నడుస్తోంది. అంచనా విలువ రూ. లక్ష విలువ చేసే పనిని 30శాతం లెస్‌కు దక్కించుకుని, దానికి అదనంగా మరొక 20శాతం అన్ని విభాగాల మామూళ్లను కలుపుకొని కాంట్రాక్టర్ పనులను నాశిరకంగా చేస్తున్నా వాటి నాణ్యతపై నిఘా వర్గాలు దృష్టి పెట్టడం లేదు.

Related Posts