YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

తాత్కాలిక బడ్జెట్‌ ప్రవేశ పెడుతున్నాము

తాత్కాలిక బడ్జెట్‌ ప్రవేశ పెడుతున్నాము

 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఎన్నికల ఏడాదిలో సాధారణంగా ఏ ప్రభుత్వమైనా ఓటాన్ అకౌంట్ లేదా తాత్కాలిక బడ్జెట్‌నే ప్రవేశపెడుతుంది. అయితే అందుకు విరుద్ధంగా ఈసారి మోదీ సర్కార్ పూర్తిస్థాయి బడ్జెట్‌ను తీసుకురానుందన్న వార్తలు వచ్చాయి. అయితే వాటిని ఖండించింది ఆర్థిక శాఖ. ఇది తాత్కాలిక బడ్జెటేనని శుక్రవారం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ స్పష్టం చేశారు. దీనిని తాత్కాలిక బడ్జెట్ 2019-20గానే పిలుస్తామని ఆయన చెప్పారు. ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. ఇక ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో కొత్తగా ఎలాంటి సేవలనుగాని, ఆర్థిక బిల్లు లేదా ఆర్థిక సర్వేనుగానీ విడుదల చేసే అవకాశం ఉండదు. అరుణ్ జైట్లీ చికిత్స కోసం అమెరికా వెళ్లడంతో ఆర్థిక శాఖ అదనపు బాధ్యతలు చూస్తున్న పియూష్ గోయల్ ఈ తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సాధారణంగా ఫిబ్రవరి చివర్లో ప్రవేశపెట్టే బడ్జెట్‌ను మోదీ సర్కార్ వచ్చిన తర్వాత ఫిబ్రవరి ఒకటినే తీసుకొస్తున్నారు. దీని వల్ల కొత్త ఆర్థిక సంవత్సరం మొదలయ్యే ఏప్రిల్ 1నే అన్ని శాఖలకూ నిధులు కేటాయిస్తున్నారు.

Related Posts