యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
దురదృష్టవశాత్తు రాష్ట్రానికి బాధ్యత లేని ప్రతిపక్షం ఉంది. ప్రజల సమస్యలు అసెంబ్లీ దృష్టికి తీసుకురావడం లేదు. అఖిలపక్షం అనేది మూహుర్తం చూసి పెట్టాలి అని ప్రతిపక్షం చెప్పడం విడ్డూరమని ఎక్సైజ్ మంత్రి జవహర్ అన్నారు. అఖిలపక్షం ఏర్పాటు అభినందనీయం అని టైం లేదు అని చెప్పడం విడ్డూరం. గతం లో జగన్ గారు జల్లికట్టు స్ఫూర్తి తో కృషి చెయ్యాలి అని చెప్పి ఇప్పుడు తమిళనాడు స్ఫూర్తి ఏమైంది. జగన్ కు అసెంబ్లీ మీద ప్రజలు మీద పోలీసులు మీద కూడా నమ్మకం లేదు. అదే విధం గా ప్రజలు కూడా జగన్ గారి పరిపాలన అవసరం లేదు అని తిరస్కరించారని అన్నారు. మా టార్గెట్ 175 నియోజకవర్గాలు గెలవడమని మంత్రి అన్నారు.