యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
బుధవారం అసెంబ్లీలో 99 అంశాల పై ప్రభుత్వం పని తీరు బాగుంది అని గవర్నర్ ప్రసంగం కొనసాగింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే దేశం లో ఏరాష్ట్రం లో జరగనంత అభివృద్ధి మన రాష్ట్రం లో జరిగిందని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు వ్యాఖ్యానించారు. 11 ఫెడరేషన్స్ ను కార్పొరేషన్ గా మార్చారు. 10 క్రొత్త కార్పొరేషన్ లు ఏర్పాటు చేశారు. ఆర్ధికంగా వనరులు సృష్టించిన విధానం ను కొనసాగిస్తున్నారు. కేంద్రం నుండి రావలసిన నిధులు, విభజన హామీలు విషయములో ప్రతిపక్షాలు కలసి రావాలని అయన అన్నారు. నవారత్నాలను నకిలిరత్నాలు గా పేర్కొన్నారు. ఢిల్లీలో ధర్మ దీక్ష పోరాటానికి ప్రతిపక్షాలు మద్దతు పలికితే రాష్ట్రానికి ఎంతోకొంత మేలుజరుగుతుంది. తమిళనాడు కేరళ లో ఏదైనా సమస్య వస్తే అందరూ కలిసి పోరాడతారు కానీ మన రాష్ట్రం లో లేదని అయన అన్నారు.