YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

జాతిపితకు నేతల ఘన నివాళ్ళు

  జాతిపితకు నేతల ఘన నివాళ్ళు
 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
జాతిపిత మహాత్మాగాంధీ 71వ వర్థంతి సందర్భంగా వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి రాజ్‌ఘాట్‌ వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తదితరులు మహాత్మునికి అంజలి ఘటించారు.అలాగే హైదరాబాద్ లోని బాపు ఘాట్ వద్ద స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మహమ్ముద్ అలీ తో పాటు పలువురు నేతలు ఘనంగా నివాళ్ళు అర్పించారు.ఈ కార్యక్రమం లో మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ,నగర మేయర్ బొంతు రాం మోహన్,రాష్ట్ర పరభుత్వ ప్రదాన కార్యదర్శి జోషి,కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.కాగా అసెంబ్లీ ఆవరణలో ఉన్న గాంధీజీ విగ్రహానికి తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనినాస్‌రెడ్డిమండలి చైర్మన్ స్వామిగౌడ్ నివాళులర్పించారు. గాంధీ చిత్రపటం వద్ద పూలు పెట్టి ఆయనను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క సహా అసెంబ్లీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ గాంధీ మార్గంలోనే దేశం ముందుకు వెళ్తుందన్నారు. మహాత్ముని మార్గం శాంతి మార్గమని తెలిపారు. గాంధీ బాటలోనే నడుస్తూ పేదరిక నిర్మూలనకు కృషి చేయాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. గాంధీజీ యాదిలో మనమంతా శాంతి సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. విద్యార్థులుయువత మహాత్ముని మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.

Related Posts