YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కోడికత్తి కేసు ఫిబ్రవరి 12కు వాయిదా

 కోడికత్తి కేసు ఫిబ్రవరి 12కు వాయిదా
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
జగన్ కోడికత్తి కేసుపై విచారణను ఏపీ హైకోర్టు ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది. ఎన్ఐఏ విచారణపై గతంలోనే రాష్ట్రప్రభుత్వం సిట్ ఫైల్ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి హైకోర్టు సూచించింది. దీంతో బుధవారం ఎన్ఐఏ కౌంటర్ దాఖలు చేసింది. గడువు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో న్యాయస్థానం ఈ మేరకు వాయిదా వేసింది.
జగన్పై కోడికత్తి దాడి కేసు బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఏ మెటీరియల్ ఆధారంగా ఎన్ఐఏ విచారణకు అంగీకరించిందో తెలపాలని గతంలో హైకోర్టు ఆదేశించడంతో.. కేంద్రం తరపు న్యాయవాది పూర్తి వివరాలతో కోర్టుకు హాజరయ్యారు. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు సిట్ తరపు లాయర్ వారం రోజుల సమయం కోరారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది

Related Posts