జార్ఖండ్‌లోని పోటకా పరిధిలోని మొహల్‌డీహా గ్రామంలో నాలుగేళ్ల పిల్లాడికి ఒక కుక్కతో వివాహం చేశారు. దీనికి గ్రామస్థులంతా హాజరుగాకా, సాంప్రదాయబద్దంగా పెళ్లి తంతు నిర్వహించారు. పిల్లాడు ఆరోగ్యంగా ఉండాలంటే కుక్కతో వివాహం జరిపించాలని ఎవరో చెప్పడంతో అనిల్ తల్లి అతనికి ఈ విధంగా పెళ్లి చేసింది. ఈ సందర్భంగా తల్లి సరస్వతి సర్దార్ మాట్లాడుతూ ‘పిల్లాడు తరచూ అనారోగ్యం బారిన పడుతున్నాడు. వాడికి కుక్కతో పెళ్లిచేస్తే ఆరోగ్యం కుదుటపడుతుందని ఎవరో చెప్పడంతో, ఇందుకోసం మంచి ముహూర్తం చూసుకుని పెళ్లి జరిపించానని పేర్కొంది. వివాహం సందర్భంగా బాలుడికి, కుక్కకు పెళ్లి అలంకరణ చేశారు. అనంతరం గ్రామస్థులంతా దగ్గరుండి పెళ్లి జరిపించారు. కాగా ఆ బాలునికి పంటిపై పన్ను ఏర్పడిన కారణంగా దానిని అపశకునంగా భావించి, ఈ వివాహం జరిపించారని గ్రామస్థులు చెబుతున్నారు.