YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం

ఎత్తులు..పై ఎత్తులతో వేడెక్కిన ఏపీ

Highlights

  • 'అవిశ్వాస' రాజకీయం
  • తీర్మాణాకి సైన్నజగన్ 
  • సవాల్ కి ప్రతి సవాల్ చేసిన పవన్ 
  • అవిశ్వాసంతో ఉపయోగం లేదన్న చంద్రబాబు 
  • విశ్వసనీయతకు కుమ్ములాట 
ఎత్తులు..పై ఎత్తులతో వేడెక్కిన ఏపీ

ఆంధ్రప్రదేశ్‌ రాష్టంలో ప్రత్యేక హోదా అంశం పై పాలక, విపక్షల ఎత్తులు పై ఎత్తులతో రోజు రోజుకు రాజకీయ పరిణామాలు వాడిగా వేడిగా తయారవుతున్నాయి. ఆయా పార్టీల కొనసాగుతున్న  సవాళ్లు - ప్రతి సవాళ్లతో రసవత్తరంగా మారింది. జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేకహోదాపై రెండు రోజులపాటు జాయింట్‌ ఫ్యాక్ట్‌ ఫైడింగ్‌ కమిటీ పేరుతో సమాలోచనలు చేశారు. మేధావులు, విపక్షపార్టీల సభ్యుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అదే సందర్భంలో.. విభజన హామీలు రాబట్టేందుకు రాజీనామాలు చేస్తే సరిపోదని... పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితేనే ప్రయోజనం ఉంటుందని పవన్‌ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం టీడీపీ, వైసీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగలిగితే.. తనకున్న పరిచయాలతో మద్దతు ఇప్పిస్తానని స్పష్టం చేశారు.
పవన్‌ సవాల్‌ను స్వీకరించిన వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల చివరివారంలో అవిశ్వాసం తీసుకొస్తామని చెప్పారు. టీడీపీ అవిశ్వాసం పెట్టినా మద్దతు ఇస్తామని ప్రకటించారు. ఇందుకోసం పవన్‌ ఇతర పార్టీలను ఒప్పించాలని సవాల్‌ విసిరారు. జగన్‌ విసిరిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నట్టు  పవన్ కళ్యాణ్  తెలిపారు. వైసీపీ అవిశ్వాసం పెడితే తాను మద్దతు ఇస్తానని చెప్పారు. మార్చి 5న అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వాలని జగన్‌కు సూచించారు. తాను 4న ఢిల్లీకి వస్తానని... అక్కడే సీపీఐ, సీపీఎం, బీజేడీ, ఆమ్‌ఆద్మీ, టీడీపీతోపాటు ఇతర పార్టీల ఎంపీల మద్దతు సంపాదిస్తానన్నారు. అవసరమైతే కర్నాటక, తమిళనాడుకు వెళ్లి వారి మద్దతు కోరుతానని స్పష్టం చేశారు.

అవిశ్వాస తీర్మానంపై ఏపీలో మాటలయుద్ధం నడుస్తున్న సమయంలో ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. అవిశ్వాసంతో ఉపయోగం ఉండబోదని తేల్చిచెప్పారు. అవిశ్వాసానికి 54 మంది ఎంపీల మద్దతు కావాలన్నారు. అన్ని ప్రయత్నాలు ముగిసిన తర్వాత చివరి ప్రయత్నంగా మాత్రమే అవిశ్వాస తీర్మానం ఉండాలని అభిప్రాయపడ్డారు. మూడున్నరేళ్లుగా ఓపికగా ఉన్నామని... రాజీనామాలు చేస్తే పార్లమెంట్‌లో ఎవరు పోరాడుతాని ఆయన ప్రశ్నించారు.అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్‌ పార్టీ కూడా స్పందించింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి తెలిపారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై లోక్‌సభలో 184వ నిబంధన కింద నోటీస్‌ ఇచ్చామని... నోటీస్‌పై చర్చతోపాటు ఓటింగ్‌ కూడా ఉంటుందన్నారు. ఒకవేళ ఆ నోటీస్‌ను స్పీకర్‌ అనుమతించకపోతే.. తామే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని  చంద్రబాబు  తేల్చి చెప్పారు.

ఏపీలో అవిశ్వాస రాజకీయం అన్ని పార్టీల్లోనూ సెగలు పుట్టిస్తోంది. మరి మార్చి నాటికి ఎవరు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారో.. ఏపీ ప్రజల విశ్వసనీయత ఎవరు పొందుతారో వేచి చూడాల్సిందే.

Related Posts