YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పునరాలోచనలో అత్తా, అల్లుళ్లు

 పునరాలోచనలో అత్తా, అల్లుళ్లు
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాహుల్ గాంధీ అనుకున్నట్లే జరగుతోంది. ఉత్తరప్రదేశ్ లో తన నాయకత్వాన్ని, పార్టీని అవమానపర్చిన బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీలకు తగిన రీతిలో గుణపాఠం చెప్పాలని భావించిన రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీని రంగంలోకి దింపారు. ప్రియాంకను ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతం ఇన్ ఛార్జిగా నియమించారు. తాము ఎనభై స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ప్రియాంక నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతుండటంతో అఖిలేష్, మాయావతిలు పునరాలోచనలో పడ్డారు. తమ ఓటు బ్యాంకుకు గండి పడే ప్రమాదముందని వారు గ్రహించారు.ఉత్తరప్రదేశ్ లో మొత్తం 80 లోక్ సభ స్థానాలను బీఎస్పీ, ఎస్పీలు పంచేసుకున్నాయి. అమేధీ, రాయబరేలి తప్ప అన్ని స్థానాల్లోనూ తామే పోటీ చేస్తాయని ప్రకటించాయి. కాంగ్రెస్ కు ఉత్తరప్రదేశ్ లో బలం లేదని మాయావతి బహిరంగంగానే చెప్పారు. భారతీయ జనతా పార్టీకి, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా తాము ఇద్దరమూ ఒకటయ్యామని, చెరి37 స్థానాల్లో స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. అఖిలేష్ కూడా తక్కువమీ తినలేదు. మధ్యప్రదేశ్ లో తమ ఎమ్మెల్యేలను మంత్రి వర్గంలోకి తీసుకోకపోవడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. వారి మాటలు కాంగ్రెస్ ను యూపీలో పూర్తిగా పక్కనపెట్టినట్లే కనపడింది.ప్రియాంక రాజకీయ ప్రకటనతో కొంత వెనకడుగు వేసినట్లే కనపడుతుంది. కాంగ్రెస్ ఒకప్పుడు యూపీని శాసించింది. అయితే సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు పుట్టుకొచ్చిన తర్వాత క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోతూ వస్తుంది. ముఖ్యంగా ఎస్సీ, మైనారిటీ ఓట్లతో పాటు అగ్రవర్ణాల ఓట్లు కూడా కాంగ్రెస్ కు గంపగుత్తగా పడేవి. ఈ ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత హస్తం పార్టీ ఓటు బ్యాంకుకు చిల్లుపడింది. ఈనేపథ్యంలో రాహుల్ ఏఐసీసీఅధ్యక్షుడిగా ఎన్నికయిన తర్వాత యూపీపై ప్రత్యేక దృష్టి పెట్టారనే చెప్పాలి. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసినప్పటికీ ఓటు బ్యాంకును పెంచుకోవడంతో పాటు క్యాడర్ నుకూడా బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రియాంక రాక తమకు దెబ్బ కొడుతుందని భావించిన ఎస్పీ, బీఎస్పీ కొంత దిగివచ్చినట్లే కన్పిస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలంటే కాంగ్రెస్ ఖచ్చితంగా బీఎస్పీ, ఎస్పీ కూటమికి మద్దతివ్వాలని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కోరడం ఇందుకు ఉదాహరణ. ప్రియాంక గాంధీ ప్రచారంలోకి దిగితే ఎంతో కొంత నష్టపోతామని భావించిన అఖిలేష్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అఖిలేష్ వ్యాఖ్యలను బట్టి చూస్తే పొత్తులపై బీఎస్పీ, ఎస్పీ పునరాలోచించుకునేటట్లే కన్పిస్తుందన్నది విశ్లేషకుల అంచనా. రాహుల్ అనుకుంటున్నట్లుగానే అఖిలేష్, మాయావతి దిగివచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, తమకు సంతృప్తికరమైన సీట్లను పొత్తులో భాగంగా కేటాయిస్తారని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Related Posts