యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి 1 నుంచి 20వ తేదీ వరకూ జరగనున్న ప్రాక్టికల్ పరీక్షలకు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఇప్పటికే ఏర్పాట్లను సిద్దం చేసింది. జిల్లా వ్యాప్తంగా 148 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. సెకండియర్ ఎంపీసీ, బైపీసీ, ఒకేషనల్
విద్యార్థులు సుమారు 34 వేల మంది ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. జిల్లాలో 5 ప్రత్యేక తనిఖీ బృందాలు, ఫ్లైయింగ్ స్క్వాడ్స్, ఇన్విజిలేటర్లను నియామకం చేశారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చారు. నిర్వహణకు అవసరమైన వసతుల కల్పనకు తగిన చర్యలు తీసుకున్నారు.
హైదరాబాద్ జిల్లాలో మొత్తం 309 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 22 ప్రభుత్వ, 18 ఎయి డెడ్ కళాశాలలతో పాటు 264 ప్రయివేటు కళాశాలలు న్నాయి. ఇవిగాక, 3 రెసిడెన్సి యల్, 1 రైల్వే కళాశాలలు న్నాయి. ప్రభు త్వ కళాశాలల్లో 11,145, ఎయి డెడ్ కళాశాలల్లో 7,402, ప్రయి వేటు కళాశాలల్లో 86,111 మంది విద్యార్థులు సెకండియర్ చదువుతున్నారు. వీరిలో ఎంపీసీ, బైపీసీ గ్రూపులతో పాటు ఒకేషనల్ విద్యార్థులు సుమారు 34 వేల మంది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి జరగనున్న ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ పరీక్షలు రెండు విడతలుగా జరగనున్నాయి. ఉదయం 9-12 వరకూ, సాయంత్రం 2-5 గంటల వరకూ ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయి. జిల్లా వ్యాప్తంగా 148 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణలో భాగంగా సిట్టింగ్ స్క్వాడ్ అధికారులు, ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులతో పాటు 5 ప్రత్యేక తనిఖీ బృందాలను అధికారులు సిద్దం చేశారు. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఎన్‌సీసీ పరీక్షలకు హజరయ్యే విద్యార్థులకు మరుసటి పరీక్షలకు హజరయ్యేలా బోర్డు అధికారులు వెసులుబాటు కల్పించారు. ఇంటర్మీడియట్‌లో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ తప్పని సరి. ప్రాక్టికల్స్‌లో ప్రయివేటు కళాశాలలు వ్యవహ రిస్తున్న ఇష్టారాజ్యానికి చెక్ పెట్టేందుకు ఇంటర్ బోర్డు పరీక్ష్ నిర్వహణలో మార్పులు చేసింది. బోర్డు నుంచి అందే ప్రశ్నాపత్రాలకు బదులుగా.. ఈ దఫా క్వశ్చన్ పేపర్‌ను ఆన్‌లైన్‌లో ఏర్పాటు చేస్తోంది. పరీక్షా సమయానికి అర్థ గంటకు ముందుగా ఆన్‌లైన్‌లో క్వశ్చన్ పేపర్‌ను ఉంచుతారు. ఈ సమయంలో ముందుగా గుర్తింపు పొందిన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ నంబర్‌తో ఆన్‌లైన్‌లో ప్రశ్నాపత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఈ పేపర్‌ను జీరాక్స్ కాపీలు తీసి విద్యార్థులకు అందజేయాల్సి ఉంటుంది. పరీక్ష ముగిసిన పిమ్మట ప్రశ్నాపత్రాన్ని, విద్యార్థుల మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. దీంతో పాటు ఏ కేంద్రాలలో పరీక్షలు జరుగుతాయో, అక్కడి కళాశాలల అధ్యాపకులు ఇన్విజిలేటర్లుగా ఉండకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.